English | Telugu

స్టేజి మీద ఇమాన్యుల్ కి రింగ్ పెట్టిన లేడీ ఫ్యాన్.. వర్ష పరిస్థితి ఏంటి ?

జాతిరత్నాలు స్టాండప్ కామెడీ ప్రతీ రోజు కొత్తగా కొత్తగా కామెడీని అందిస్తూ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇటీవలి లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఇందులో శ్రీముఖి గేలరీలో కూర్చున్న ఆడియన్స్ కి ఒక టాపిక్ ఇస్తుంది "ప్రాసలు - పొగడ్తలు" . ప్రాస పదాలతో పొగడ్తలు చెప్పాలని కండిషన్ పెడుతుంది. అప్పుడు ఒక చిన్న కుర్రాడు వెంకట్ లేచి " నేను మాట్లాడే భాష తెలుగు..నువ్వున్న చోట ఉంటుంది వెలుగు" అంటూ ప్రాస పదాలతో శ్రీముఖిని పొగిడేస్తాడు. తర్వాత ఒక అమ్మాయి లేచి నిలబడి ఇమ్ము ఇది నీకు అంటూ " ఎక్కువ తింటే వస్తుంది గ్యాసు ..ఇద్దరం కలిసి చేసేద్దాం రొమాన్సు" అంటూ పొగిడేసరికి ఇమ్ము సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక శ్రీముఖి " ఇది చూసి ఇంటికెళ్ళాక మీ డాడీ చేస్తాడు నీతో డ్యాన్సు" అంటూ కౌంటర్ ఇచ్చేస్తుంది. ఏమమ్మా ఎం మాట్లాడుతున్నావ్.. ఏ స్కూల్ అంటూ పంచ్ ప్రసాద్ సీరియస్ గా అడిగేసరికి హైస్కూల్ అంటాడు నూకరాజు. ఏ క్లాస్ అని ప్రసాద్ మళ్ళీ అడిగేసరికి "ఆన్లైన్ క్లాస్" అని ఆన్సర్ ఇచ్చి ఫన్ క్రియేట్ చేస్తారు శ్రీముఖి, నూకరాజు.

ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తానని అడిగింది కదా నీ అభిప్రాయం ఏమిటి ఇమ్ము అంటుంది శ్రీముఖి..నాకు ఇష్టమే రొమాన్స్ అంటాడు..అసలు రొమాన్స్ అంటే ఏమిటి అంటూ ఏమి తెలియనట్టే అడుగుతాడు నూకరాజు. తర్వాత ఆడియన్స్ నుంచి చందు అనే కుర్రాడు లేచి ప్రాస పొగడ్త శ్రీముఖి మీద చెప్తాను అంటాడు. నీ ప్రాస పొగడ్త నచ్చితే నీతో డాన్స్ చేస్తానంటూ సూపర్ ఆఫర్ కూడా ఇచ్చేస్తుంది శ్రీముఖి.

"ఆకాశంలో ఎగురుతుంది గద్ద ..నేను రోజూ నీకు కలిపి తినిపిస్తా అన్నంముద్ద" అంటూ పొగిడేస్తాడు. తర్వాత మౌనిక అనే అమ్మాయి లేచి " గుండ్రంగా తిరుగుతుంది బొంగరం నీ వేలుకు తొడిగేస్తా ఉంగరం" అంటూ ఇమ్ముని పొగిడేస్తోంది. ఆ డైలాగ్ నచ్చేసరికి ఇమ్ము మౌనికను స్టేజి మీదకు తీసుకొచ్చి ఒక డ్యూయెట్ కి డాన్స్ చేస్తాడు. తర్వాత శ్రీముఖి పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటే ఇమ్మూకి, నూకరాజుకి రింగ్ పెట్టేస్తుంది మౌనిక. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది.