English | Telugu
హిమ - జ్వాల అనుబంధంపై శోభ అనుమానం
Updated : Jun 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ శనివారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఒకసారి చూద్దాం. 'నిరుపమ్.. జ్వాల.. హిమల మధ్య ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి.. వీళ్ల గురించి గట్టిగా పట్టించుకోవాలి' అని శోభ అనుకుంటూ వుంటుంది. మరో వైపు తనకు క్యాన్సర్ అని చెప్పినా నిరుపమ్ వినిపించుకోకపోవడంతో 'ఎందుకు బావా అన్నీ చెప్పినా నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు?' అని అడుగుతుంది హిమ.
ఆ మాటలు విన్న నిరుపమ్ `నీ మీద ప్రేమ ఎప్పటికీ చావదు హిమ` అంటాడు. 'అయితే నా ప్రేమను మీకు వేరేవాళ్ల రూపంలో అందించబోతున్నాను. దాన్ని నువ్వు స్వీకరించాలి' అంటుంది. ఇదంతా చాటుగా వున్న శోభ గమనిస్తుండగానే తన పేరు జ్వాల అని చెబుతుంది హిమ. ఆ మాటలకు నిరుపమ్ ఆగ్రహించి ఏం మాట్లాడుతున్నావ్ హిమ అని చిరాకు పడతాడు. శోభ మాత్రం ఆ అవకాశం నాకు ఇవ్వొచ్చుకదే పోయి పోయి ఆ ఆటోదాన్ని ఎందుకు కట్టబెట్టాలనుకుంటున్నావు` అని శోభ మనసులో అనుకుంటుంది.
'జ్వాలకు నువ్వంటే ఇష్టం బావ' అని హిమ చెప్పగానే నిరుపమ్ షాకవుతాడు. తననే నువ్వు పెళ్లి చేసుకోవాలని హిమ చెబుతూనే కళ్లు తిరిగి పడిపోతుంది. కట్ చేస్తే శోభలో అనుమానాలు మొదలవుతాయి. ఒక డాక్టర్ కు ఆటోదాన్నిచ్చి పెళ్లి చేయాలని హిమ ఎందుకు అనుకుంటోంది? అని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో వుంది. అదే సమయంలో జ్వాల చేతిపై వున్న హెచ్ అనే అక్షరం మరింత అనుమానాన్ని బలపరుస్తుంది. హెచ్ అంటే హిమ కాదు కదా? అని శోభ ఆలోచనలో పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.