English | Telugu
బాలయ్యకు ఉదయభాను మెసేజ్.. తర్వాత జరిగింది ఇదే!
Updated : Jun 11, 2022
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు జూన్ 10 శుక్రవారం జరిగాయి. అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే యాంకర్ ఉదయభాను మాత్రం బాలయ్య బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి వార్తల్లో నిలిచింది. బాలయ్య బాబు మహోన్నత వ్యక్తిత్వానికి నేను సాక్షిని అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 'బాలయ్య బాబుని అభిమానించే ప్రతి అభిమానికి ఆయన పుట్టిన రోజు పండగే. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అందుకే నేను ఆయన అభిమానిగా మారిపోయా, వీరాభిమానినయ్యా` అని చెప్పుకొచ్చింది.
'మనిషి అన్నాక కొంచెం గర్వం వుండాలి. కానీ ఆ కొంచెం గర్వం కూడా లేని నిగర్వి ఆయన. మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయనని అభిమానించే వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి బాలయ్య. అలాంటి వ్యక్తికి అభిమానిని అయినందుకు గర్విస్తున్నాను. మాట ముక్కుసూటి తనం, మనసు పసి పాపతో సమానం.. అందుకే అభిమానులంతా నా కోసం జై బాలయ్య అనండి' అంటూ ఓ వీడియోని విడుదల చేసింది యాంకర్, నటి ఉదయభాను. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తనకు దేవుడు ఎన్నో దూరం చేశాడని, చివరికి తనకు ఇద్దరు కవలల్ని వరంగా ఇచ్చాడని అయితే వాళ్ల ఫస్ట్ బర్త్ డేని ఘనంగా చేయాలనుకున్నానని ఇందు కోసం భారీ గా ఏర్పాట్లు చేశానంది.
అయితే ఈ పార్టీకి ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలని ఆహ్వానించాలని ఫోన్ లు చేస్తే ఎవ్వరూ స్పందించలేదని, అయితే బాలయ్య బాబుకి చిన్న మెసేజ్ చేస్తే ఆయన అరగంటలో ఫోన్ చేసి అన్ని పనులు వదులుకుని నా బిడ్డల ఫంక్షన్ కి వచ్చారని, నా బిడ్డల్ని ఆశీర్వదించారని తెలిపింది. సెలబ్రిటీలా కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్ లా వచ్చి మా కోసం 45 నిమిషాలు గడిపారని.. ఇలా ఎంత మంది వుంటారని.. ఇది ఆయన వ్యక్తిత్వం అని ఎమోషనల్ అయింది ఉదయభాను. ఈ వీడియోని నెట్టింట బాలయ్య అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.