English | Telugu

అడవి శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు...అతను మల్టిపుల్


చెఫ్ మంత్ర సీజన్ 3 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ ఇద్దరూ వచ్చారు. రాగానే నిహారిక శేష్ మీద ఒక రెండు లైన్స్ చెప్పింది "ఎయిట్ తర్వాత వస్తుంది నైన్ ...మా శేష్ సింగల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్" అనేసరికి రాహుల్ రవీంద్రన్ అసలు విషయం బయటపెట్టేసాడు. "శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు. శేష్ యాక్చ్యువల్లి మల్టిపుల్..." అని చెప్పేసరికి శేష్ షాకైపోయాడు. ఇంతలో యాదమ్మ రాజు అక్కడికి వచ్చాడు ఒక కెమెరా పట్టుకుని. యాదమ్మ రాజును చూసాక ఎవడీడు అని శేష్ అడిగాడు "నా పేరు జూ పార్క్ రాజు" అని చెప్పాడు. "జూ పార్క్ ఏంట్రా" అని నిహారికా అడిగింది.

"అడివి శేష్ అని పెట్టుకున్నప్పుడు అడిగారా ఎవరైనా" అని క్వశ్చన్ చేసాడు. "మీతో ఒక సినిమా తీద్దామనుకుంటున్నా నేను ... టైటిల్ ఏంటో తెలుసా కర్రీ పాయింట్ ..ఇంతకు మీ డేట్స్ ఉన్నాయా" అని శేష్ ని అడిగాడు యాదమ్మ రాజు. "నేను రాహుల్ తో బిజీగా ఉన్నాను" అని చెప్పాడు. వెంటనే యాదమ్మ రాజు శేష్ చేతిలో డేట్స్ అదే ఖర్జూర పళ్ళు పెట్టి "ఎవరన్నా అడిగితే డేట్స్ లేవని చెప్పొద్దు" అని పంచ్ వేసేసరికి శేష్ తెగ నవ్వేసుకున్నాడు. "నేను ఆల్రెడీ రెండు సినిమాలు తీశాను చూస్తే ఘోరం అని" అని చెప్పాడు యాదమ్మ రాజు. "ఎవడైనా చూసాడా అసలు" అని నిహారికా అడిగేసరికి "అంత ఘోరంగా ఉంటే ఎవరు చూస్తారు" అంటూ కౌంటర్ పంచ్ ఇచ్చాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..