English | Telugu

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ!


టీవీ సీరియల్స్ లలో స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ కి ఉండే ఫ్యాన్ బేసే వేరు. అందులోను బ్రహ్మముడికి ప్రతీ వారం అత్యధిక టీఆర్పీ లభిస్తూనే ఉంది. ఈ కథ మొదలవ్వడమే మధ్యతరగతి కుటుంబానికి ధనిక కుటుంబానికి మధ్య గల వ్యత్యాసాన్ని చూపించింది.

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. రాజ్, కావ్య ప్రధాన పాత్రలుగా..‌ అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక-కళ్యాణ్, స్వప్న-రాహుల్, ఇందిరాదేవి సీతారామయ్య.. కనకం, కృష్ణమూర్తి, అప్పు పాత్రలతో ఈ సీరియల్ ప్రస్తుతం అలా సాగుతుంది. ‌అయితే ఈ సీరియల్ లో మరో కొత్త క్యారెక్టర్ రానుంది. రాజ్, శ్వేతలు త్వరలో పెళ్ళి చేసుకుంటారని భావిస్తున్న కావ్యకి.. అపార్థం చేసుకుంటున్న రాజ్ మధ్యలో అరవింద్ రాబోతున్నాడు. ఈ పాత్ర నెగెటివ్ గా ఉండబోతుంది. అయితే అరవింద్ కావ్య, రాజ్ ల మధ్య జరుగుతున్న అపార్థాలని మరింత పెద్దవిగా చేసి వారిని విడదీస్తాడా? లేక వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతాడా అనేది ప్రశ్నగా మిగిలింది.

తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో కావ్యని అపర్ణ తన కార్ ఇచ్చి మరీ ఆఫీస్ కి పంపించడం, మామ సుభాష్ ఏకంగా పది సంవత్సరాల అగ్రిమెంట్ ఎంప్లాయ్ ని చేయడంతో ఆఫీస్ లో రాజ్ భాగోతం బయటపడేలా ఉంది. అయితే రాజ్, శ్వేతల మధ్య ఏం ఉందా అనే క్యూరియాసిటి అందరిలో ఉండగా.. శ్వేతని కావ్యని ముఖాముఖిగా కలుస్తుంది. మరి శ్వేత అసలు విషయం చెప్పనుందా? లేక అరవింద్ వచ్చేసి కావ్య, రాజ్ ల బంధాన్ని విడదీస్తాడా తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.