English | Telugu
ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్!
Updated : Dec 30, 2023
విజయవాడలో పుట్టిన మంగళంపల్లి శ్రీసత్య అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ శ్రీసత్య అంటే తెలిసిపోతుంది. విజయవాడలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన శ్రీసత్య హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. అక్కడే తన కెరీర్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై అవకాశాల కోసం వెతుకుతున్న టైములో వెండితెర ఛాన్స్ వచ్చింది. "నేను శైలజ" మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి బాగా ఫేమస్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 6లో యాక్టివ్ గా యాక్టివ్ గా ఉంటూ చికెన్ కావాలంటూ ఆమె చేసిన అల్లరి ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది. గతంలో కొన్ని సీరియల్స్ లో చేసింది శ్రీ సత్య. ఐతే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కాన్సంట్రేషన్ చేసింది. 'డీజే టిల్లు 2'లో కనిపించనున్నట్లు ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది అని అలాగే మరో మూవీ షూటింగ్ కి అమెరికా వెళుతున్నట్లు చెప్పింది. ఐతే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేసింది. మన్మధుడు మూవీలో నాగ్ చెప్పే పెళ్లి సలహాని రీల్ గా చేసింది.."ఒక్క విషయం విను సుబ్బారావు..పెళ్లంటే నూరేళ్ళ పంట కాదు ఎవ్రీ డే మంట" అని చెప్పింది శ్రీసత్య. ఇక ఆ వీడియోకి నెటిజన్స్ చాల కామెంట్స్ పోస్ట్ చేశారు. "ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్ ... మేకప్ లేకుండానే బాగున్నావ్. మిమ్మల్ని చేసుకుంటే మాత్రం చికెన్ పంట వేయాల్సిందే వచ్చేవాడు " అంటూ వెరైటీగా రెస్పాండ్ అవుతున్నారు. "తొందర పడకు సుందర వదనా సీజన్ 1 & 2 "సిరీస్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ లాంటి బ్రాండ్‌ల ఫోటోషూట్స్ లో కూడా కనిపించింది ఈ అమ్మడు.