English | Telugu
శ్రీసత్యపై నెటిజన్ల కామెంట్ల వర్షం!
Updated : Nov 16, 2022
ఈ బిగ్ బాస్ సీజన్లో బ్యూటీ ఆఫ్ ది సీజన్ గా చెప్పుకునేది శ్రీసత్య అనే విషయం తెలిసిందే. కాగా గత వారం గెస్ట్ గా వచ్చిన కమెడియన్ హైపర్ ఆది కూడా 'నీ కోసమే చాలా మంది ఫ్యాన్స్ బిగ్ బాస్ చూస్తున్నారు' అని అన్నాడు. ఇలా అందరు తన గ్లామర్ ని పొగడటంతో, కాస్త తల పొగరుగానే ప్రవర్తిస్తోంది.
కాగా గత నాలుగు వారాల నుండి శ్రీసత్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీసత్య గత కొన్ని రోజులుగా రేవంత్, శ్రీహాన్ లతో మాత్రమే ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ తో సరిగా మాట్లాడట్లేదు. అదే విషయం గురించి కీర్తి భట్ సోమవారం జరిగిన నామినేషన్ లో మాట్లాడుతూ "నేను సత్య.. సత్య అని పిలిచినా కూడా పట్టించుకోకుండా, నా ముందు నుండే వెళ్ళావ్" అని చెప్పి నామినేట్ చేసింది. ఇనయా, కీర్తి భట్ లతో శ్రీసత్య మాట్లాడే విధానం, వాళ్ళని వెక్కిరించడం, ఒక ఆటిట్యూడ్ తో కూడిన వెటకారం చూసి ప్రేక్షకులకు కూడా చిరాకు వేస్తుందనే చెప్పాలి.
కెప్టెన్ గా కూడా ఆమె ఫెయిల్ అయింది. నామినేషన్ లో కూడా తన పొగరుతో ఒక నెగెటివ్ మార్క్ పడిందనే చెప్పాలి. అయితే ఒక వైపు నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మరో వైపు శ్రీసత్య, శ్రీహాన్ గుసగుసలాడుతూ నవ్వుకున్నారు. ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 'శ్రీసత్యా! మీరు నామినేషన్ ప్రక్రియను అవమానించారు' అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పించే అంశాలుగా ఉన్నాయి. అందుకే శ్రీసత్యకి ఓటింగ్ కూడా తక్కువే ఉంది. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు శ్రీసత్యకి 'అసత్య' అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కాగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో 'అసత్యని ఎలిమినేట్ చెయ్యాలి' అనే ట్యాగ్ లైన్ తో ఒక ట్రెండ్ క్రియేట్ చేసారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే ఈ వారం శ్రీసత్యనే ఎలిమినేట్ అవుతుంది అని ఎక్కువ మంది వీక్షకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికైనా శ్రీసత్య తన ప్రవర్తన మార్చుకుంటుందో, లేదో..చూడాలి మరి.