English | Telugu

కార్తీకదీపం జ్యోత్స్న ని‌ ఆడుకున్న నెటిజన్లు!

కార్తీకదీపం2 నవ వసంతంగా స్టార్ మా టీవీ ప్రేక్షకులకి కొత్త పండగలా వచ్చేసింది. మొదటి సీజన్ కి ఎంత ఆదరాభిమానాలున్నాయో ఇప్పటికీ ఆ ఫ్యాన్ బేస్ అలానే ఉందంటే మాటలా.. రాత్రి ఎనిమిది గంటలైతే చాలు.. ప్రతీ ఇంట్లో ఒకటే పాట.. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం‌‌. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో హీరో, హీరోయిన్ తప్ప అందరు కొత్త నటీనటులు ఉండటంతో కాస్త కొత్తగా ఉంది‌.

ఇక ఈ సీరియల్ మొదలైందో లేదో మోనిత పాత్రలో జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి చేస్తుందని.. తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి మరీ కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు పాజిటివ్ కామెంట్లు చేయగా మరికొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. గాయత్రి సింహాద్రి కూడా తన స్టైల్ లో రిప్లై ఇచ్చేస్తుంది. త్రినయని సీరియల్‌లో ‘కసి’గా కనిపించిన గాయిత్రి సింహాద్రి.. ఇప్పుడు కార్తీక దీపం 2 లో విలన్ గా కార్తీక్ కి మరదలిగా నెగెటివ్ రోల్ ని చేస్తోంది. కార్తీకదీపం 2 సీరియల్‌తో పాటు ‘జోష్’ షో కూడా చేస్తున్నా. త్రినయనిలో కూడా కసిగా చేశాను. నన్ను చాలామంది కసి అనిపిలుస్తారు. కార్తీకదీపం 2లో జోత్స్న పాత్ర కూడా తప్పకుండా మీకు నచ్చుతుంది. నెగిటివ్ క్యారెక్టర్ చేసినంత మాత్రాన నెగిటివ్‌గా ఉండరు. నెగిటివ్ క్యారెక్టర్‌ని ప్రాణం పోయాలంటే నెగిటివ్‌గానే నటించాలి.

గాయత్రి సింహాద్రి కి ఇన్ స్టాగ్రామ్ లో నలభై మూడు వేల‌మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కార్తీకదీపం 2లో ఇంతమంది సూపర్ సీనియర్స్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఈ సీరియల్ గురించి హిస్టరీలో చెప్పుకుంటారని గాయిత్రి సింహాద్రి చెప్పింది. మోనిత ప్లేస్‌లో గాయిత్రి రావడంతో.. మోనిత ఫ్యాన్స్ హర్ట్ అవుతూ ఈమెపై ఎటాక్ చేస్తున్నారు. అయితే నెగిటివ్ కామెంట్లపై కూడా చాలా ఫన్నీగానే స్పందించింది. అయితే ఓ సెలబ్రిటీ లైవ్‌లోకి వచ్చిందంటే.. ఆమె ముఖం గురించి వేసుకున్న బట్టలు, ఒంటిపై ఉన్న టాటూలు, శరీర భాగాలు ఇలా చాలా కామెంట్లే వస్తుంటాయి. అయితే ఓ నెటిజన్ ఈ జూనియర్ మోనితని భయపెట్టే కామెంట్ చేశాడు. మీ జుట్టు మెరిసిపోయిందేంటి మేడమ్ అని కామెంట్ పెట్టాడు. దానికి షాక్ అయిన గాయత్రి సింహాద్రి.. అయ్యో నా జుట్టు మెరిసిపోలేదండీ అంటూ అసలు విషయం చెప్పింది. ఓ మై గాడ్ ఇది వైట్ హెయిర్ కాదు.. అక్షింతలు. టెంపుల్‌కి వెళ్తే పంతులు గారు అక్షింతలు వేశారు. మీరు నాకు హార్ట్ ఎటాక్ రప్పించారు. అమ్మాయిలకు స్కిన్‌తో పాటు హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు వైట్ హెయిర్ వచ్చిదంటే కంగారు పడ్డాను. మీ ప్రేమను తట్టుకోలేకపోతున్నానండీ బాబూ అంటూ గాయత్రి సింహాద్రి రిప్లై ఇచ్చింది. మరి మీలో ఎంతమంది కార్తీకదీపం సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ లో జ్యోత్స్న గా గాయత్రి సింహాద్రి నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..