English | Telugu
అఖిల్ కాకపొతే నిఖిల్..గతంతో నాకు పని లేదు
Updated : Aug 7, 2023
బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో "నీతోనే డాన్స్" ప్రతీవారం శని, ఆదివారాల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. బీబీ జోడిని తలదన్నేలా ఉంటున్నాయి ఈ షోలోని డాన్స్ పెర్ఫార్మెన్సెస్..నీతోనే డాన్స్ షోలో బీబీ జోడిని ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ వారం వాళ్ళను కూడా తీసుకొచ్చారు. నిఖిల్-కావ్యకి జోడీగా తేజస్విని మాదివాడ ఎంట్రీ ఇచ్చింది. బీబీ జోడిలో తేజు-అఖిల్ జోడి చేసిన రచ్చని ఇప్పటికీ ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ హాట్ డాన్స్ స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి. జడ్జి రాధ ఐతే ఈ జోడి చేసే పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయేవారు.
అలాంటి తేజు ఈ వారం కావ్య-నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ముగ్గురూ ముద్దులు పెట్టేసి కాయితాలు చింపేసారు. మిగతా కంటెస్టెంట్ జోడీస్ కి వీళ్ళ డాన్స్ స్టెప్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ తెగ నచ్చేసాయి. ఫుల్ మార్క్స్ ఇచ్చేసారు. సదా కావ్యని, తేజుని హగ్ చేసుకుంది కానీ హాట్ గా ఉన్న నిఖిల్ ని మాత్రం హగ్ చేసుకోను అని చెప్పేసారు. ఇక శ్రీముఖి తన ఇంటర్వ్యూ రౌండ్ మొదలుపెట్టింది. " ఏమనిపించింది మీ ఆయనతో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేయడం" అని అడిగేసరికి కావ్య సిగ్గు పడిపోయింది. " ఆ కంఫర్ట్ ఉంది కాబట్టే డాన్స్ ఇంత బాగా వచ్చింది" అని కవర్ చేసాడు నిఖిల్. "తేజు ఈ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నీకు నీ అఖిల్ గుర్తొచ్చాడా" అని అడిగేసరికి " చెప్పాలంటే నేను ప్రెజంట్ సిట్యువేషన్ లో జీవిస్తాను.. నాకు ఫ్యూచర్ తో పాస్ట్ తో సంబంధం లేదు" అని చెప్పేసరికి శ్రీముఖి దాన్ని చాలా సింపుల్ గా "అఖిల్ కాకపొతే నిఖిల్ అనేగా నీ ఉద్దేశం" అని అడిగేసరికి "అవును కదా మరి అలాగే ఉండాలి" అని జడ్జి రాధా కూడా తేజుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.