English | Telugu
Brahmamudi:ప్రాణాపాయ స్థితిలో అప్పు.. తన ప్రేమని బ్రతికించుకోగలదా?
Updated : Jan 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -303 లో.... స్వప్న పూజకి రెడీ అవుతుంది. అత్త అంటూ రుద్రాణిని పిలిచి.. నా చీరలు కుచ్చులు సెట్ చెయ్ అనగానే రుద్రాణి, రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. స్వప్న అలా తనతో పని చేయించుకోవడంతో రుద్రాణికి కోపం వస్తుంది కానీ ఏం చెయ్యలేదు. స్వప్న చీర కుచ్చులు సెట్ చేస్తుంది.
ఆ తర్వాత పూజకి రండి అని పంతులు గారు పిలుస్తాడు. అనామిక, కళ్యాణ్ ఇద్దరు జంటగా వస్తుంటే ధాన్యలక్ష్మి చూసి మురిసిపోతుంది. అ తర్వాత స్వప్న, రాహుల్ లు వస్తారు. తన కొడుకు కోడలు వస్తుంటే వాళ్ళ అమ్మ ఎలా మురిసిపోతుంది.. మీరేంటి మొహం అలా పెట్టారని రుద్రాణిని స్వప్న అడుగుతుంది. నా మొహం అంతే అని రుద్రాణి కోప్పడుతుంది. మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు రెడీ అయి వస్తుంటే.. అప్పుడే కనకం ఫోన్ చేసి అప్పుకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. దాంతో పద వెళదామని రాజ్ అనగానే.. నేను వెళ్తాను మీరు కిందకి వెళ్ళండి. పూజ ఆగకూడదని రాజ్ తో కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఒక్కడే కిందకి రావడం చూసి ఇంట్లో వాళ్ళు కావ్య ఎక్కడ అని అడుగుతారు. బయటకు వెళ్ళింది.. మీరు పూజ జరిపించండి అని రాజ్ అనగానే.. మంచి మాట చెప్పావని ధాన్యలక్ష్మి అంటుంది. అంటే ఏంటి అర్ధం నీ కొడుకు కోడలు పూజ చేస్తే సరిపోతుందా కావ్యపై కోపాన్ని రాజ్ పై చూపిస్తున్నావా? కావ్య పై నాకు కోపం ఉన్నా కూడా నా కొడుకు భార్యనే అని అపర్ణ అంటుంది. నీ కోడలు వచ్చినప్పటి నుండి పూర్తిగా స్వార్థంగా మారిపోయావని అపర్ణ అంటుంది. కావ్య వచ్చాకే పూజ జరుగుతుందని ఇందిరాదేవి అంటుంది.
మరొకవైపు కావ్య హాస్పిటల్ కి వెళ్లి కనకాన్ని కలిసి బాధపడుతుంది. అప్పుని ఆ సిచువేషన్ లో చూసి కావ్య బాధపడుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి బ్లడ్ కావాలని చెప్తుంది. సరే నేను ట్రై చేస్తానని కావ్య వెళ్తుంది. మరొకవైపు అనామిక పూజ దగ్గర నుండి లేచి వెళ్ళబోతుంటుంది. ఏమైందని ఇంట్లో వాళ్ళ అడుగుతారు. కావ్యకి ఈ పూజ జరగడం ఇష్టం లేదని అనామిక అంటుంది. అంత ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలి కదా అని అనామిక అనగానే.. భర్తకి చెప్పి వెళ్లినా చెప్పినట్టే అని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో అప్పుకి యాక్సిడెంట్ అయిన విషయం రాజ్ ఇంట్లో అందరికి చెప్తాడు. అదే సమయంలో బ్లడ్ త్వరగా ఎక్కించకపోతే పేషెంట్ కోమాలోకి వెళ్తుందని డాక్టర్ చెప్తుంది. దాంతో కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.