English | Telugu
నవ్య స్వామి క్షమించమంటోంది ఎందుకు?
Updated : Jan 6, 2022
బుల్లితెర తారల్లో నవ్య స్వామికి ఉన్న పాపులారిటీ వేరే రేంజ్. `ఆమె కథ` సీరియల్ తో నవ్యస్వామి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదే సీరియల్ ద్వారా నవ్యస్వామికి, రవికృష్ణకు మధ్య మంచి స్నేహం ఏర్పడిన విషయం తెలిసిదే. ఈ జోడీ మధ్య కెమిప్ట్రీ బాగా కుదరడంతో ఇద్దరిపై చాలా రూమర్లు వచ్చాయి. ఆ రూమర్ లకు తగ్గట్టే బయట కూడా వీరిద్దరు బాగా క్లోజ్‌గా కనిపించడంతో ఈ జంట బాగుందంటూ ఆడియన్స్ కామెంట్ లు చేశారు.
Also read:బాలయ్యా మజాకా.. రానాని ఆడేసుకున్నాడుగా!
బుల్లితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట ప్రతీ షోలోలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ప్రతీ ఈవెంట్ లోనూ ఇద్దరు కలిస్తే రచ్చ మామూలుగా వుండేది కాదు. ఈ ఇద్దరిపై వస్తున్న రూమర్ లకు రవికృష్ణ ఓ షో సాక్షిగా ఆజ్యం పోశాడు. టీవీ రియాలిటీ షోలోనే నవ్యస్వామికి ఏకంగా ముద్దు పెట్టేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. `ఆమె కథ` సీరియల్ సమయంలో నవ్యస్వామికి కోవిడ్ సోకడం... ఆ తరువాత రవికృష్ణకు సోకడంతో ఇద్దరూ చాలా ఇబ్బందులు పడ్డారు.
Also read:సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
ఇవన్నీ పక్కన పెడితే న్యూ ఇయర్ సందర్భంగా నవ్య స్వామి తన అభిమానులని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఏడాదిలోకి క్లీన్ మైండ్, హార్ట్ తో అడుగుపెడుతున్నానని చెప్పుకొచ్చింది. గత ఏడాది తనకు బాగా గడిచిందని చెప్పిన నవ్య ఈ విషయంలో మీరు నాకు రుణపడి వుంటే దాని గురించి మర్చిపోండని, అయితే మీకు నేను అన్యాయం చేశానని అనిపిస్తే అందుకు నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నానని తెలిపింది. "అసలే ఈ జీవితం చాలా చిన్నది.. పెండింగ్ లో వున్న కోపం, పగలు అదనపు ఒత్తిడిని వదిలేయండి.. 2022ని ఎంజాయ్ చేయండి" అని తన అబిమానులకు తెలిపింది.