English | Telugu
నాటీ నరేష్ ని వాడుకుని వదిలేసిన గర్ల్ ఫ్రెండ్!
Updated : Sep 9, 2022
ఈ మధ్య బుల్లి తెర షోస్ లో లవ్ పెర్ఫార్మెన్సులు ఎక్కువయ్యాయి. వాళ్ళ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీస్ నే స్కిట్స్ రూపంలో డాన్సస్ రూపంలో చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో లవ్ స్టోరీ. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో చేసే నాటీ నరేష్ లవ్ స్టోరీ నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ ఐన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమోలో నరేష్ తన లవర్ స్టోరీ పెర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టేసాడు. తన రియల్ రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందని చెప్పాడు.
నరేష్ ఒక ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా అతడి డ్యాన్స్ కి ఫిదా ఐన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. నరేష్ ఆ అమ్మాయితో రొమాంటిక్ గా డ్యాన్స్ కూడా చేస్తాడు. ఒక రోజు ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం నరేష్ చూసేస్తాడు. ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా అని ఆమె బాయ్ ఫ్రెండ్ అడిగేసరికి అలా కాదు అభి ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించిన డబ్బు మొత్తం తీసేసుకుని ఆ తర్వాత వాడిని వదిలేద్దాం అని చెబుతుంది. తనని ప్రేమ పేరుతో మోసం చేయడం మాత్రమే కాక తన లోపాన్ని హేళన చేసేసరికి నాటీ నరేష్ గుండె పగిలిపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తాడు. పిచోడైపోతాడు. నరేష్ చేసిన ఈ ఎమోషనల్ పెర్ఫామెన్స్ అందరి చేతా కన్నీళ్లు తెప్పించింది.
ఈ షోకి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ సదా కూడా నరేష్ స్కిట్ చూసి ఆశ్చర్యపోతుంది. స్కిట్ అయ్యాక చాలా నాచురల్ గా యాక్ట్ చేశారు అంటూ నరేష్ కి కాంప్లిమెంట్ ఇస్తుంది.. "మీ లైఫ్ లో ఏదైనా బాధ ఉందా అని అడిగేసరికి అవును మేడం ఉంది" అంటాడు. ఇక ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది, సన్నీ, ఆటో రాంప్రసాద్, నూకరాజు వీళ్లంతా ఇల్లీగల్ ఎఫైర్స్ కాంటెస్ట్ పేరుతో ఒక ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి గెస్టులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు వచ్చి స్కిట్స్ ని ఎంజాయ్ చేశారు.