English | Telugu
ఆఖరి నిమిషంలో బతికించమని అడిగాడు నాన్న..నా దగ్గర ఉన్నదంతా పెట్టేసాను
Updated : Aug 14, 2023
"నీతోనే డాన్స్ " షోలో ఈ వారం ప్రతీ జోడీ అద్భుతమైన డాన్స్ చేసి అదరగొట్టారు. కనెక్షన్ రౌండ్ లో ఒక్కో పెర్ఫార్మెన్స్ ఒక్కో లెవెల్ లో ఉంది. నటరాజ్ మాష్టర్- నీతూ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. జడ్జెస్ ఐతే ఫుల్ ఖుషీ ఇపోయారు. జడ్జ్ రాధా నీతూని హేట్ చేస్తున్నట్లు చెప్పారు. అద్భుతమైన ఫ్లోర్ మూవ్మెంట్స్ అసలు ఎలా చేసావ్ అని అడిగారు. ఇక అంజలి- పవన్ వీళ్లకు 5 మార్క్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రతీ షోలో వీళ్ళ మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి షో ఎండింగ్ కి వచ్చేసరికి నీతూ పెర్ఫార్మెన్స్ చూసి అంజలి వచ్చి గట్టిగా హగ్ చేసేసుకుంది. పవన్ మాత్రం నటరాజ్ మాష్టర్ సరిగా డాన్స్ చేయలేదని చెప్పాడు. కానీ నటరాజ్ మాష్టర్ మాత్రం అతని వైపు చూడలేదు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఈ షోలో కొరియోగ్రాఫర్స్ గా ఉన్న ఆట సందీప్- నటరాజ్ మాష్టర్ ఇద్దరూ లాస్ట్ లో వచ్చి డాన్స్ ఇరగదీసి చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ కి ముందు సాగర్ - దీప పెర్ఫార్మెన్స్ చూసాక నటరాజ్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
"నేను హీరోగా చేసాను, అన్ని చేసాను.. ఇండస్ట్రీకి వచ్చి 24 ఇయర్స్ అయింది. మా నాన్న మంచి ఆర్టిస్ట్. ఊర్లో డ్రామాలవి చేసేవారు. ఆయన మీద కోపంతో నేను హైదరాబాద్ పారిపోయి వచ్చేసాను. మేము ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. పెళ్లయ్యాకే మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మా మధ్య బాండింగ్ పెరిగే టైంలో నాన్నకు లివర్ ఫెయిల్ అయ్యింది. ఆ విషయం మాకు చెప్పలేదు. చివరికి ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఒక మాట అడిగారు. నాకు బతకాలని ఉంది..బతికించవా అని . నా డబ్బులు మొత్తం నాన్న వైద్యానికి ఖర్చు పెట్టేసాను. ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా షూటింగ్ చూస్తానని నాన్న అడగలేదు..నేను కూడా ఆయన్ని ఎప్పుడూ స్టేజి మీదకు తీసుకురాలేదు. ఇప్పుడు తెలుస్తోంది నాకు ఆ బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నటరాజ్ మాష్టర్.