English | Telugu
బోల్డ్ లుక్ తో ట్రెండింగ్ లోకి రీతూ చౌదరి!
Updated : Aug 14, 2023
బుల్లితెర నుండి వెండితెర వరకు నటీమణుల అందాల ఆరబోతకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఇందులో తాజాగా తీస్తున్న సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కావాలని చేర్చుతున్నారు మేకర్స్. అయితే సినిమాలని తలపించే ఎక్స్ పోజింగ్ తో పిచ్చెక్కిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు.. అందులో రీతూ చౌదరి ఒకరు. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి రీతూ.. తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది.
రీతూ చౌదరి 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతి లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
అయితే ఈ మధ్య రీతూ చౌదరి తన బోల్డ్ ఫోటోలని చూపిస్తూ వైరల్ గా మారుతుంది. అయితే తను ఏ పోస్ట్ చేసినా వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్లు, లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. కాగా తాజాగా జల్సా సినిమాలోని ఒక పాటకి తను రీల్ చేసింది. " టైటానిక్ హీరోయిన్ పార్ట్ టూ నువ్వని నవ్వుతున్న మోనాలిస మొత్తుకోద" అనే లిరిక్స్ కి తన అందాలని చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో రీల్ ని చేయగా.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. అయితే తన బోల్డ్ లుక్ చూడటానికే సగం ఫాలోయింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో లో వైరల్ గా మారింది.