English | Telugu

"సుమ ఆంటీకి నేను వీరాభిమానిని".. నాని అల్ల‌రికి హ‌ర్ట‌యిన సుమ‌!

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పంచ్‌లతో అందరికీ చుక్కలు చూపిస్తుంటుంది.అలాంటి సుమకే తన కామెంట్స్‌తో మాటలు రాకుండా చేశాడు హీరో నాని. కెమెరా ముందే సుమను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నాని. దెబ్బకి సుమ దండం పెట్టేసి నేను వెళ్లిపోతున్నా అనేసింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. సుమ హోస్ట్ గా చేస్తున్న షోలలో 'క్యాష్' ఒకటి.

సినీ, టెలివిజన్ ప్రముఖులను అతిథులుగా తీసుకొని ఈ షోలో రచ్చ చేస్తుంటుంది సుమ. సెలబ్రిటీలతో సుమ చేసే సందడి మాములుగా ఉండదు. అయితే తాజాగా షోలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. నేచురల్ స్టార్ నాని.. సుమపై పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు. మే 22న ప్రసారం కానున్న సుమ 'క్యాష్' షోకి నాని 'టక్ జగదీష్' టీమ్ గెస్టులుగా వచ్చాయి. హీరో నాని, హీరోయిన్ రీతువర్మలతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, న‌టుడు తిరువీర్‌ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ వీడియోలో సుమ పరువుతీసేలా హీరో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'సుమ ఆంటీ' అంటూ ఆమెని ఆడేసుకున్నాడు నాని. "అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు" అని సుమ అనడంతో వెంటనే అందుకున్న నాని.. ''ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం'' అంటూ రచ్చ చేశాడు. అది విని షాకైన సుమ.. "నేనెళ్లిపోతున్నా" అనేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.