English | Telugu

శేఖర్ మాస్టర్ మంచి మ‌న‌సు.. ప‌స్తులుంటున్న డాన్స‌ర్ల కోసం..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరిగిపోయాయి. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. లాక్ డౌన్ వలన చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి. దీంతో పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్ లో కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది డాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉంటున్నారు.

దీంతో అలాంటివారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గ్రూప్ డాన్సర్ లు, టీవీ షోలు చేసే డాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పిన ఆయన.. తినడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.

ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డాన్సర్లు సహా చాలా మందికి ఆదాయం లేదని.. హైదరాబాద్ లో ఉన్న డాన్సర్లకు ఎవరికైనా నిత్యావసర సరుకులు అవసరమైతే తాను అందిస్తానని శేఖర్ మాస్టర్ అన్నారు. ఈ మేరకు 9989189885, 9618961492, 7416519257 నెంబర్లకి ఫోన్‌ చేసి ఉచితంగా నిత్యావసర సరకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. అవసరం ఉంటేనే తప్ప బయటకి రావొద్దని సూచించారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...