English | Telugu
హోస్ట్‌గా బాలయ్య అన్‌స్టాపబుల్ రికార్డ్
Updated : Jan 7, 2022
మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా స్టార్ హీరోలు బుల్లితెరపై సందడి చేస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జాబితాలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా, తమన్నా వంటి వారు రియాలీటీ షోలకు హోస్ట్ లుగా వ్యవహరించి తమ సత్తా చాటుకున్నారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోతో అలరిస్తున్నారు. రానా `నెం.1 యారీ` టాక్ షోతో ఆకట్టుకోగా.. ఇదే తరహాలో సమంత `సామ్ జామ్` షోతో ముందుకొచ్చింది.
అయితే ఈ జాబితాలో హీరో నందమూరి బాలకృష్ణ ఎంటరవుతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె`కు ఊహించని స్థాయిలో హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇండియన్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన టాప్ రేటింగ్స్ లో టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది.
Also Read: బిగ్‌బాస్ ఓటీటీ అతని చేతికా?
ఇప్పటి వరకు తెలుగులో చాలా టాక్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ `ఆహా` ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' టాక్ షో సాధించినంత విజయాన్ని ఇంత వరకు ఏ టాక్ షో సాధించలేదు. వెండితెరపై పవర్‌ఫుల్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య ఇప్పుడు `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె` అంటూ తనదైన స్టైల్లో స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అంతే కాకుండా సెలబ్రిటీలను బాలయ్య సరదాగా ఆటపట్టిస్తున్న తీరు కూడా ఈ షోకి ప్రధాన హైలైట్ గా నిలుస్తోంది. ఇప్పటికే 7 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో మరో మూడు ఎపిసోడ్ లతో తొలి సీజన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది.