English | Telugu
బిగ్‌బాస్ ఓటీటీలోకి `నగ్నం` బ్యూటీ
Updated : Feb 19, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 ఏ స్థాయిలో హంగామా చేసిందో తెలిసిందే. కొంత మందిని హీరోలని చేస్తే మరి కొంత మందిని జీరోలని చేసింది. కొంత మందికి సినిమా అవకాశాలని అందిస్తే మరి కొంత మందికి అవకాశాలు లేకుండా చేసింది. కొంత మంది జంటలని కలిపితే మరి కొంత మంది జంటలని విడగొట్టింది. దీని కారణంగా ఇప్పటికీ కొన్ని జంటలు నెట్టింట వార్తల్లో నిలుస్తూనే వున్నారు. ఇదిలా వుంటే సీజన్ 5 చేసిన రచ్చని ఇంకా మరిచిపోకముందే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ మొదలుకాబోతోంది.
Also Read:బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వివాదం కాదుగా..
ప్రయోగాత్మకంగా 24*7 ఈ ఓటీటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షోని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే నాగార్జున, వెన్నెల కిషోర్, మురళీశర్మలపై చిత్రీకరించిన ప్రోమోని ఇప్పటికే రిలీజ్ చేశారు. 24 గంటల కాన్సెప్ట్ తో రానున్న ఈ సీజన్ ఆకట్టుకోవడం మీద అనుమానాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గంటలకు గంటలు చూస్తే ఖచ్చితంగా బోర్ ఫీలవుతారని అంటున్నారు. ఇతర భాషల్లో ఓటీటీ బిగ్ బాస్ క్లిక్ కావడంతో అదే పంథాని తెలుగులోనూ కొనసాగిస్తూ తాజగా ఓటీటీ బిగ్‌బాస్ షోకు శ్రీకారం చుడుతున్నారు.
Also Read:ముంబైలో ఒకేసారి రెండు కొత్త ఫ్లాట్‌లు కొన్న కాజోల్! ధర ఎంతంటే...
ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్ట్ లీక్ కాగా తాజాగా వర్మ హీరోయిన్ `నగ్నం` ఫేమ్ శ్రీ రాపాక పేరు బయటికి వచ్చింది. తను గనక షోలోకి ఎంట్రీ ఇస్తే హంగామా మామూలుగా వుండదని, వినోదంతో పాటు కనువిందైన వినోదం పుష్కలంగా దొరుకుతుందని, ఓటీటీ బిగ్ బాస్ కు ఇలాంటి వాళ్లే ప్రధాన పాత్ర పోషించబోతున్నారని, కావాల్సి నంత కంట్రవర్సీలు క్రియేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి `నగ్నం` ఫేమ్ శ్రీ రాపాక బిగ్ బాస్ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?.. ఇస్తే ఎంత డిమాండ్ చేయనుంది అన్నది త్వరలోనే తెలియనుంది.