English | Telugu

అఖిల్ సార్థక్ సెలూన్ ని ఓపెన్ చేసిన నాగార్జున


బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయాడు. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా అఖిల్ సందడి చేయడం లేదు. నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వీతో అఖిల్ డ్యాన్స్ చేసాడు ఆ తర్వాత అస్సలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ సందడి చేస్తున్నాడు అఖిల్. హైదరాబాద్ లో ఎలెవన్ సలోన్ ని ఓపెన్ చేసాడు. ఇక తన సలోన్ ఓపెనింగ్ ఫంక్షన్ కి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాడు.

ఆర్జే కాజల్, రోల్ రైడ, సిరి హన్మంత్, నోయెల్, అలాగే హీరో నాగార్జున, బ్రహ్మముడి మానస్ వాళ్ళ అమ్మ పద్మిని, వచ్చారు. ఇక నాగార్జునతో సలోన్ ని ఓపెన్ చేయించాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్ గా నిలైహ్చాడు అఖిల్. ఐతే అఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. కొన్ని షోస్ కి హోస్ట్ చేసాడు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అందరిలో కొందరికైనా దశ తిరుగుతుంది కానీ అఖిల్ కి మాత్రం ఇంకా మహర్దశ వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు సలోన్ ఓపెన్ చేసేసరికి నెటిజన్స్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.