English | Telugu
Nagarjuna Warns Sanjana: నాగార్జున మాట లెక్కచెయ్యని సంజన.. ఈ వీకెండ్ వార్నింగ్ తప్పేలా లేదుగా!
Updated : Nov 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో సంజన కంటెంట్ క్రియేటర్ గా ముద్ర వేసుకుంది. హౌస్ లో ఇప్పటివరకు చేయని విధంగా దొంగగా ముద్ర తెచ్చుకున్న కంటెస్టెంట్ సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మొదటి వీక్ నే హౌస్ లో గుడ్లు దొంగతనం చేసి హౌస్ ఫోకస్ మొత్తం తనపై తిప్పుకుంది సంజన. చూసే ఆడియన్స్ కి సైతం గేమ్ చేంజర్ సంజన అనిపించింది. కానీ అలా ప్రతీసారీ దొంగతనాలు చేస్తూ ఉండడంతో హౌస్ మేట్స్ కి చిరాకు వచ్చింది.
నాగార్జున మొదట్లో కామెడీగా తీసుకున్నా ఆ తర్వాత దొంగతనాలు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వినకపోయేసరికి దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉన్న బోర్డ్ సంజన మెడలో వేశారు. నువ్వు జోక్ అనుకుంటున్నది అన్నివేళలా అందరికి జోక్ కాకపోవచ్చని నాగార్జున ఒక వీకెండ్ లో చెప్పాడు. ఫ్యామిలీ వీక్ లో ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు మీరు దొంగతనం చేసినప్పుడు చాలా ఫన్ గా ఉండేదని చెప్పడంతో మళ్ళీ హౌస్ లో దొంగతనం మొదలుపెట్టింది సంజన. నిన్నటి ఎపిసోడ్ లో భరణికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ దాచేసింది.. ఎవరు తీశారని కెప్టెన్ అయిన రీతూ అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరు తియ్యలేదని అంటారు. సంజన గారు మీరు తీసేటప్పుడు తనూజ చూసిందంట ప్లీజ్ ఇవ్వండి అని రీతూ అనగానే నాకు తెలియదని సంజన అంటుంది. ఇక రాత్రి కాగానే భరణి దగ్గరికి సంజన వెళ్ళి మాట్లాడుతుంది. నేనే తీసాను టాబ్లెట్స్.. మీతో మాట్లాడాలని అని సంజన అనగానే.. రేపు మాట్లాడుదామని భరణి అంటాడు.
మరుసటిరోజు భరణి దగ్గరికి సంజన వచ్చి.. నేను ఏదో ఫన్ క్రియేట్ చేయాలని చేసాను కానీ ఇమ్మాన్యుయల్, దివ్య మొత్తం స్పాయిల్ చేశారని సంజన అంటుంది. దివ్య వచ్చి ఏడ్చింది టాబ్లెట్స్ ఇవ్వండి అని అందుకే ఇచ్చేసానని సంజన చెప్తుంది. ఈ వీకెండ్ లో నాగార్జున సంజన విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.