English | Telugu
భువనేష్ కి హగ్ ఇచ్చిన సోగ్గాడు చిన్నినాయన!
Updated : Aug 26, 2022
సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి సంబంధించి ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ పోటీలో ఐదుగురు చిన్నారుల్లో ఎవరు టైటిల్ విన్ అవుతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ షోకి బ్రహ్మానందం, నాగార్జున వచ్చి పెర్ఫార్మెన్సులు చూసి కామెంట్స్ కూడా చేశారు. సుధీర్ మధ్యమధ్యలో కామెడీ పండించాడు.. "అడిగా అడిగా" అంటూ పాట పడేసరికి "అలా ఏడుస్తూ పాడతావేంటి.. నువ్ వేసుకున్న డ్రెస్ మీద పెట్టిన ఇంపార్టెన్స్ రాగం మీద, తాళం మీద పెడితే బాగుపడతావ్" అంటూ సీరియస్ గా అనేశారు బ్రహ్మి.
తర్వాత " నువ్ పాడమ్మా అని అనసూయని అనేసరికి ఏటో చూస్తూ ఉంటుంది. అంతలో బ్రహ్మి ఆ చాలు..అలా ఉండాలి పాటంటే.. జలపాతంలో అలా అలా వెళ్ళిపోవాలి" అంటారు సుధీర్ తో .."అసలు ఆమె పాటే పాడలేదు..మరి ఆ పాటలో జలపాతాలు ఎలా కనిపించాయని" అడుగుతాడు సుధీర్. ఇక తర్వాత సుధీర్ హేమచంద్రతో కలిసి సూపర్ సాంగ్ పాడతాడు. "సింగారాల పైరుల్లోన, బంగారాలే పండేనంట" పాటను ఇరగదీసి పాడి అందరినీ మెస్మోరైజ్ చేశారు. ఫైనల్ గా భువనేష్ వచ్చి "థిల్లానా" సాంగ్ పాడాడు. "ఈ సాంగ్ జై చిరంజీవలోది కదా ..
నీకు చిరంజీవి అంటే ఇష్టమా" అనే భువనేష్ ని అడిగేసరికి అవునంటాడు. తర్వాత "నాకు మిమ్మల్ని హగ్ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది" అని అడిగేసరికి స్టేజి దిగి వచ్చి చాలా ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు నాగ్.