English | Telugu
కృష్ణ కోసం రొమాంటిక్ గా రెడీ అయి వచ్చిన మురారి!
Updated : Jun 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.. హాస్పిటల్ కి వెళ్దామని మురారి కోసం కృష్ణ ఎదురుచూస్తుంటుంది. మురారి రెడీ అయి వచ్చాక ఇద్దరు కలిసి కార్ లో బయల్దేరి వెళ్తారు.
అలా కార్ లో వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి భార్య, భర్తలలాగా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు కలిసి ఒకరొనొకరు నిజమైన భార్యభర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర కృష్ణని దించి, లంచ్ కి ఇక్కడికే వచ్చేసెయ్ కలిసి వెళ్దామని తనతో మురారి అంటాడు. సరేనని చెప్పేసి కృష్ణ వెళ్తుంది. మరోవైపు కృష్ణ, మురారీల గురించి రేవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. కృష్ణ, మురారీలు కలిసి పూజలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టుగా ప్రమాణం చేశారు. మరెందుకని ఆ అగ్రిమెంట్.. అది వాళ్ళకి తెలియకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే అగ్రిమెంట్ అని అనుకుంటే శాశ్వతంగా భార్యాభర్తలుగా నేను చేస్తాను కదా అని రేవతి అనుకుంటుంది.
మరొకవైపు స్టేషన్ లో ఉన్న మురారి ఆకలి అవుతుందని కృష్ణకి కాల్ చేసి.. ఏంటి కృష్ణ రావా ? నాకు ఆకలవుతుందని మురారి అనగానే.. స్టేషన్ బయటకు రండి ఏసీపీ సర్ అనగానే బయటకు వచ్చేస్తాడు మురారి. అప్పటికే కమీషనర్ కృష్ణ దగ్గరకి వచ్చి నిల్చుంటాడు. బయటకెళ్తున్నారా మురారి ఒకసారి లోపలికి రమ్మని పిలుస్తాడు కమీషనర్. లోపలికి వెళ్ళాక.. కృష్ణకి నీ ప్రేమ విషయం చెప్పేయ్ తొందరగా లేట్ చేయకని మురారీతో కమీషనర్ చెప్తాడు. ఆ తర్వాత యూనిఫామ్ తీసేసి ఫార్మల్స్ చేసుకో, కార్ కాకుండా బైక్ తీసుకొని వెళ్ళమని మురారికి కమీషనర్ చెప్తాడు. సరేనని బైక్ కీ తీసుకొని కృష్ణ దగ్గరికి రాగానే మురారిని చూసిన కృష్ణ.. ఇవన్నీ మీ కమీషనర్ చెప్పాడా అని అడుగుతుంది. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.