English | Telugu

బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ అవుట్.. ఏడ్చేసిన సరయు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం పూర్తి చేసుకుంది. తొలి వారం సరయు లేదా మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతారని మొదట్లో అభిప్రాయపడ్డారు అంతా. అయితే చివరిలో ఊహించని విధంగా ముమైత్ ఖాన్ పేరు తెరమీదకు వచ్చింది. అనుకున్నట్లుగానే మొదటి ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.

ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి, టాస్క్ లు ఆడించిన హోస్ట్ నాగార్జున మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రకటించాడు. మొదట తాను ఎలిమినేట్ అవుతానని భావించిన సరయు తెగ ఏడ్చేసింది. ఆ తరువాత సరయు సేఫ్ అయ్యి, ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిందని నాగ్ తెలిపాడు. సేఫ్ అయినప్పుడు సరయు అలాగే కాసేపు ఏడ్చింది.

బిగ్ బాస్ 5 లో పార్టిసిపేట్ చేసిన సరయు తన బిహేవియర్ తో మొదటి వారమే ఎలిమినేట్ అయింది. నాన్ స్టాప్ లో కూడా సరయు అలాగే ఎలిమినేట్ అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ సరయు కాకపోతే, ఆడియన్స్ కి పెద్దగా తెలియని మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని భావించారంతా. కానీ వీరిద్దరికంటే ముమైత్ కి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె ఆర్జే చైతుతో సిగరెట్స్ ఇష్యూ గురించి పదే పదే వాదన పెట్టుకోవడంతో ఆమె పట్ల ఆడియెన్స్ పాజిటివ్ గా లేరని, అదే ఆమె ఎలిమినేషన్ కి కారణమని అంటున్నారు. ఎలిమినేట్ అవ్వడంతో ముమైత్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.