English | Telugu

అఖిల్ ని అమ్మేస్తున్నాం...ఎవరైనా కొనుక్కుంటారా?

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ తో పోటాపోటీగా తలపడ్డాడు. ఫైనల్ లో రన్నరప్ గా నిలిచాడు. రీసెంట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి పేరుతో స్టార్ మా వాళ్ళు ఒక డాన్స్ ప్రోగ్రాం చేశారు. తేజస్వినితో కలిసి మంచి హాట్ పెర్ఫార్మెన్సెస్ చేసి జడ్జెస్ కి చెమటలు పట్టించాడు. అలాంటి అఖిల్ కి బిగ్ బాస్ పెద్దగా ప్లస్ అయ్యిందేమీ లేదు. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అలాంటి అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక స్టేటస్ పెట్టాడు. ఆ స్టేటస్ చూస్తే నవ్వని వాళ్ళు కూడా నవ్వేస్తారు.

అఖిల్ రీసెంట్ ఫోటో ఒకటి పెట్టి చాటింగ్ చేసుకున్నారు..."అఖిల్ ప్రైస్ ఎంత అంటే ...నేను ఒక ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేస్తాను ఇతనితో" అంటూ ఒక కామెడీ చాటింగ్ జరిగింది. అది అఖిల్ కి ఎలా వచ్చిందో దాన్ని పోస్ట్ చేసుకుని ఒక కామెంట్ పెట్టుకున్నాడు "అసలేమయ్యిందిరా ఈ జనాలకి... నాకు అర్ధం కావడం లేదు...నేనేమన్నా వస్తువును అనుకున్నార్రా...ఒక మూవీ ఆఫర్ కూడా ఇచ్చారా...ఇలా అయ్యుంటే ఇప్పటికి ఎన్ని మూవీస్ చేసుంటానో కదా...కానీ ఈ కేటగిరీలో కాదండోయ్" అంటూ ఒక నవ్వు ఎమోజి పెట్టి ఏ కేటగిరీ చాటింగో మీరే అర్ధం చేసుకోండి అన్నట్టుగా ఆన్సర్ ఆడియన్స్ కే వదిలేసాడు. బీబీ జోడి కోసం బాగా బరువు తగ్గిన అఖిల్ ఇప్పుడు ఫుల్ స్లిమ్ గా ఫిట్ గా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గుజ్జర్ తో కలిసి అఖిల్ నడిపిన ప్రేమాయణం గురించి ఆడియన్స్ ఎవరూ కూడా మర్చిపోరు. హౌస్ లోంచి బయటికి వచ్చాక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. రీసెంట్ గా జరిగిన బీబీ జోడిలో తేజుతో కలిసి చేసిన హాట్ పెర్ఫార్మెన్సెస్ కి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు అభిమానులు. అలాంటిది ఏమీ లేదని...తనకి ఇంకా పెళ్లి వయసు రాలేదని చెప్పి తప్పించుకున్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.