English | Telugu

నువ్వు నేను కలిసి ఉండలేం.. ముకుందకి తేల్చి చెప్పేసిన మురారి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్.. బుల్లితెరపై సరికొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్టార్ మాటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కోడళ్ళుగా ఒకే ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణ, ముకుందలది వేరు వేరు కథలు. మొదట ముకుందని ప్రేమించి, అనుకోని పరిస్థితుల్లో కృష్ణని పెళ్ళి చేసుకున్న మురారి కథే.. ఈ సీరియల్. బుధవారం జరిగిన ఎపిసోడ్-51లో మురారి సస్పెన్షన్ ని రద్దు చేపించినందుకు, కృష్ణకి థాంక్స్ చెప్తూ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేపించారు.

అయితే మొదటగా మురారి కేక్ కట్ చేసి, వాళ్ళ పెద్దమ్మ భవానీకి తినిపించబోతుండగా.. "ముందు కృష్ణకి తినిపించు" అని సైగ చేస్తుంది. ఆ తర్వాత "కృష్ణ కేక్ తింటుందా? లేదా?" అనే అనుమానంతో అటువైపుగా చూస్తాడు మురారి. "సరే అన్నట్టుగా" కృష్ణ సైగ చేయడంతో తనకి కేక్ తినిపిస్తాడు. ఇలా కృష్ణకి ప్రేమతో కేక్ తినిపించడం చూసిన‌ ముకుంద జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత "కృష్ణ నువ్వు మురారికి తినిపించు" అని రేవతి చెప్తుంది. "నువ్వు కూడా తినిపించు అక్క" అని భవానిని అడుగుతుంది రేవతి. భవాని కేక్ తీసుకొని కాసేపు "తినిపించాలా? వద్దా?" అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక తినిపించదేమోనని కృష్ణ దిగులుగా వెళ్ళిపోతుండగా.. "నీ భార్యకి అంత ఇగో ఏంటి మురారి. కాసేపు కూడా ఆగట్లేదు. కేక్ తినిపించకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ ని పార్శిల్ చేయాలా? ఏంటి" అని భవాని అడుగుతుంది. అప్పుడు కృష్ణ ఆగి భవాని దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత నవ్వుతూ కృష్ణకి కేక్ తినిపిస్తుంది భవాని. దీంతో‌ కుటుంబసభ్యులంతా చప్పట్లతో కృష్ణకి అభినందనలు తెలుపుతారు. అయితే వీళ్ళంతా కృష్ణకి దగ్గరవ్వడం చూడలేని ముకుంద, జెలస్ తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ముకుంద తన గదిలోకి వెళ్ళిపోతుంది. "నిన్ను కలవాలి మురారి" అని మెసేజ్ చేస్తూ ఉంటుంది. మురారి తనని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. "ఏంటి మురారి. ఏం జరుగుతుంది. నా ప్రేమని మర్చిపోయావా? ఏంటి మీ సరసాలు" అని అడుగుతుంది. "నిన్ను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. నా మనసు తలుపు ఎప్పుడో మూసుకుపోయింది" అని సమాధానమిస్తాడు మురారి. "చాలా రోజుల నుండి ఆ తలుపు బయట నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను" అని అంది ముకుంద. "నువ్వు.. నేను ఎప్పటికీ కలసి ఉండలేం. నువ్వు మా కుటుంబంలో ఒక సభ్యురాలివి మాత్రమే. దయచేసి మళ్ళీ ఇలా కలవాలని నన్ను పిలవకు. ఇలా మన ఇద్దరిని, ఎవరు చూసినా బాగోదు" అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.