English | Telugu

వసుధార తనకి అక్కర్లేదని చెప్పిన రిషి!


'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మా టీవీలో అత్యంత ఎక్కువ వీక్షకాదరణ పొందుతున్న ధారావాహిక. ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్-657లో వసుధార పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్ కి వెళ్తుంది.

రిషి తన కాలేజీ దగ్గరికి వస్తాడు. వసుధారతో తను గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. అప్పుడే రిషి దగ్గరకు వస్తుంది జగతి. "అన్ని జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోనవసరం లేదు రిషి. మర్చిపో" అని చెప్తుంది. "మీ శిష్యురాలు నాకు మంచి గుణపాఠమే చెప్పింది. మీరేమో నా పసి మనసును అర్థం చేసుకోకుండా చిన్నప్పుడే, అలా వదిలిపెట్టి వెళ్ళారు. నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో జవాబు చెప్పలేని మీరు ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్తారు? మీ శిష్యురాలు మీకు కన్పిస్తే ఒక్కటి చెప్పండి. రిషీకి మోసపోవడం కొత్తేమీ కాదు. అలవాటే.. తను లేకపోయిన తన జ్ఞాపకాలతో బ్రతికేస్తానని చెప్పండి. తను నాకు అక్కర్లేదని కూడా చెప్పండి" అని చెప్పేసి అక్కడి నుండి రిషి వెళ్ళిపోతాడు. వసుధార హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ అమ్మనాన్నలైన చక్రపాణి, సుమిత్రలను చూస్తుంది. "అమ్మ.. లే అమ్మ" అని అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత తన తండ్రి చేయి పట్టుకొని "నాన్న మీకు గౌరవం పెంచే పనినే చేశాను. కాని ఎప్పుడు మిమ్మల్ని కించపరిచే పనిని చెయ్యలేదు నాన్న" అని ఏడుస్తుంది.

వసుధార దగ్గరికి రాజీవ్ వస్తాడు. "నువ్వు నేను ఈ ప్రపంచానికి ఇప్పుడు భార్యాభర్తలం" అని రాజీవ్ అంటాడు. దానికి వసుధార "బావ నోరు అదుపులో పెట్టుకో" అని అంది. "అదుపులో ఉంటుంది వసు.. ఇప్పుడు మనమిద్దరం అనఫీషియల్ గా భార్యభర్తలమన్నమాట" అని చెప్తాడు. "పురాణాల్లో రాక్షసుల ముగింపు ఎలా జరిగిందో నాకు తెలుసు. నీకు అదే గతి పడుతుంది" అని చెప్తుంది వసుధార. "ఏంటి శాపాలు పెడుతున్నావా వసు. మీ రిషీ సర్ పాపం.. తన పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్ళలో మునిగిపోయే కాగితం పడవలా ఉంది. పడవే కానీ మునగక తప్పదులే. తనంటే నీకు ఇష్టమే, నువ్వంటే తనకు కూడా ప్రాణమే. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి అని అనుకుంటున్నాడు. కాబట్టి రిషి నీకు దూరమైనట్టే" అని అంటాడు. "పగటి కలలు కనకు బావ" అని వసుధార చెప్తుంది. ఆ తర్వాత చక్రపాణి, సుమిత్రలకు మెలకువ వస్తుంది. వాళ్ళు స్పృహలోకి రావడం చూసి, చాలా సంతోషపడుతుంది వసుధార. వెంటనే అక్కడున్న సిస్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.