English | Telugu

దీప గురించిన నిజం సౌందర్యకి తెలుస్తుందా!

'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సీరియల్.. ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ లతో సాగుతోంది. మోనిత సడన్ ఎంట్రీ. కార్తిక్, దీప, సౌందర్యలతో పాటు కుటుంబం అంతా కలిసిపోవడం. సౌందర్యకి తెలియకుండా కార్తిక్, దీపలు దాచే సీక్రెట్స్.. వెరసి ఇప్పుడు ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.

బుధవారం వచ్చిన ఎపిసోడ్-1559లో ఇంట్లోకి హిమ, శౌర్యలతో పాటుగా సౌందర్య, కార్తిక్, దీపలు వస్తారు. వాళ్ళు వచ్చేకంటే ముందే ఇంట్లోకి వచ్చేస్తుంది మోనిత. మోనితని చూసి "ఎందుకే మళ్ళీ వచ్చావ్?" అని జుట్టుపట్టుకొని సౌందర్య అడుగుతుంది. "అబ్బా ఆంటీ.. వదలండి. ఇప్పటికే మీ కొడుకు నా వంక చూడట్లేదు. ఇక జుట్టు రాలిపోతే అసలే చూడడు" అని మోనిత సమాధానమిస్తుంది. పక్కనే ఉన్న దీప "బయటకు పోవే" అని అంటుంది. "ఎందుకు దీప.. అంత కంగారు. ఆంటీకి ఏం చెప్పలేదా? అయ్యో ఆంటీ వీళ్ళు మీకు ఏం చెప్పలేదా? ఇన్నాళ్ళు వీళ్ళు మీ దగ్గరికి రాకుండా ఎందుకు ఉన్నారో మీకు నిజంగా చెప్పలేదా?" అని మోనిత చెప్తూ ఉంటుంది. మధ్యలో కార్తిక్ కలుగజేసుకొని "మోనిత.. ఫస్ట్ ఇంట్లోంచి బయటకెళ్ళు" అని కోప్పడతాడు. "ఇన్నాళ్ళు చెప్పలేదంటే ఓకే కానీ.. ఆంటీ కనిపించాకైనా నిజం చెప్పాలి కదా కార్తిక్" అని మోనిత సాగదీస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య "ఏంట్రా ఏమిటో చెప్పాలంటుంది. ఏంటది?" అని కార్తిక్ ని అడుగుతుంది. వెంటనే దీప "అవన్నీ పట్టించుకోకండి అత్తయ్య. ఇది మన కుటుంబంలో ఎలా గొడవలు పెట్టాలని మాత్రమే చూస్తుంది" అని అంటుంది. ఆ తర్వాత మోనితని బయటకు గెంటేస్తుంది దీప.

ఆ తర్వాత చారుశీల ఇంటికొస్తుంది మోనిత.
అక్కడ చారుశీల, మోనిత ఇద్దరూ మాట్లాడుకుంటారు. "అసలు ఏం జరుగుతుంది" అని చారుశీల అడుగుతుంది. మోనిత మాట్లాడుతూ "కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పన్నెండు సంవత్సరాల నుండి కార్తీక్ వెంటపడుతున్నాను. దీపని మధ్యలో తప్పించి, కార్తీక్ కి దగ్గరయ్యాను. కానీ దీప వచ్చి గద్దలా తన్నుకుపోయింది. ఇప్పుడు కూడా దీపని సైడ్ చెయ్యడం సులువే. కానీ ఆ సౌందర్య నాకంటే డేంజర్. రివాల్వర్ రాణి. తేడా వస్తే కాల్చి పడేస్తుంది" అని చెప్తుంది. అలా చెప్పేసరికి "మరి కార్తీక్ ని వదిలేయచ్చు కదా" అని చారుశీల అంటుంది. దానికి మోనిత "అది జరగని పని. నేను కార్తిక్ ని వదిలిపెట్టను. కార్తిక్ ప్రేమను ఎలాగైనా దక్కించుకుంటాను. కార్తిక్ ని నా సొంతం చేసుకుంటాను " అని చెప్తుంది.

కార్తిక్, దీప, హిమ, శౌర్య అందరూ కలిసి సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అందరూ సరదగా ఉంటారు.‌ సౌందర్య మాత్రం మోనిత చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కార్తిక్, దీపలు ఎలా ఉంటున్నారో ప్రతీది గమనిస్తూ, వీళ్ళు ఏదో దాస్తున్నారని ఇద్దరిపై అనుమానపడుతుంది సౌందర్య. అయితే మేడ మీదకెళ్ళి కార్తిక్, దీపలు మాట్లాడుకుంటున్నప్పడు, రహస్యంగా వినాలని చూస్తుంది సౌందర్య. కిటికీలో నుండి సౌందర్యని చూసిన దీప మెల్లిగా కవర్ చేస్తుంది. మాట మార్చి కార్తిక్ ని డైవర్ట్ చేసేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.