English | Telugu

Krishna Mukunda Murari : ఆ కాంపిటీషన్ కి వెళ్ళమని చెప్పి‌న మురారి.. కృష్ణ కర్పూరం ఆరిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -384 లో.. వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ నైట్ వద్దని అంది. మనకి ముహూర్తం పెట్టుకోమని చెప్పింది కదా.. ఇంకెందుకు ఆలస్యమని మురారి అంటాడు.. వాళ్ళకోసమే ఇన్ని రోజులు ఆగాము.. వాళ్ళతో పాటు మాకు అంతే కానీ ఇప్పుడు మాకు వద్దని భవాని అత్తయ్యకి చెప్పానని కృష్ణ అనగానే.. మురారి డిస్సపాయింట్ అవుతాడు. పదిరోజుల తర్వాత కూడా పెద్దమ్మ వద్దని చెప్తే ఎలా అని మురారి అంటాడు. అదే ఆ లోపు ముకుంద పూర్తిగా మారిందని అత్తయ్యకి నమ్మకం కలిగించాలని కృష్ణ చెప్తుంది.

ఆ తర్వాత అందులో ఏదైనా చేయాలని కృష్ణ అనగానే.. నా దగ్గర ఐడియా ఉంది. నా ఫ్రెండ్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాడు. మన ఇద్దరిని రమ్మని చెప్పాడు. మనతో పాటు ఆదర్శ్ ముకుందల పేర్లు ఇస్తే అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందరికి ముకుంద మారిందో లేదో అనుమానం క్లియర్ అవుతుందని మురారి అనగానే.. కృష్ణ సరే అంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కర్రీస్ లో సాల్ట్ వెయ్యడం మర్చిపోయావా కృష్ణ అని అందరు అంటారు. ఏంటి ఈ రోజే ఫస్ట్ టైమ్ వంట చేస్తున్నట్లు చేసావని భవాని అంటుంది. కృష్ణ కాదు వంట చేసింది నందు అని తెలుస్తుంది. కాసేపు మధు సరదాగా నందుని అటపట్టిస్తాడు. ఆ తర్వాత నేను ఒక విషయం చెప్పాలంటు మురారి చెప్తాడు. మా ఫ్రెండ్ కండక్ట్ చేస్తున్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి మీ నేమ్స్ ఇచ్చామని ఆదర్శ్ కి చెప్తాడు. మా పేర్లు ఎందుకు.. మీ పేర్లు ఇచ్చుకోండని ముకుంద అంటుంది. మా పేర్లు కూడా ఇచ్చుకున్నామని మురారి అంటాడు. నాకు ఇష్టం లేదని ముకుంద అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకంటే అందులో అడిగే ప్రశ్నలకి మేమ్ సమాధానాలు చెప్పలేమని ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారంటే ఏం చెప్తామని ఆది బాధపడుతాడని ఆదర్శ్ కూల్ అయ్యేలా‌ ముకుంద మాట్లాడుతుంది. అలా ఏం ఉండదని ఆదర్శ్, ముకుందలని మురారి కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణ ఫ్రెండ్ ఫారెన్ వెళ్తుంది. సెండాఫ్ ఇవ్వడానికి వెళ్తాన్నానని మురారి అనగానే.. ముకుంద, ఆదర్శ్ లని కూడా తీసుకొని వెళ్ళండని నందు అంటుంది. నేను వెళ్ళనని ముకుంద అంటుంది. ముకుంద తన మాటలతో ఆదర్శ్ ని చెప్పినట్లు వినేలా చేసుకుంటుంది.

ఆ తర్వాత ముకుందపై భవానికి డౌట్ వస్తుంది. చూద్దాం.. ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ఎలా ఉంటుందో చూద్దామని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత ఈ కాంపిటీషన్ నుండి ఎలా తప్పించుకోవాలని ముకుంద ఆలోచిస్తుంది. ఎందుకు వాళ్ళతో సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళం కదా.. ఎందుకు వద్దన్నావని ముకుందని ఆదర్శ్ అడుగుతాడు. నాకు డస్ట్ ఎలర్జీ.. నైట్ టైమ్ ఎందుకని అలా అన్నానని ముకుంద కవర్ చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వెళ్తారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి గుడికి వెళ్తారు. దేవుడి ముందు కర్పూరం వెలిగించని పంతులు గారు చెప్పడంతో కృష్ణ వెలిగిస్తుంది. అది ఆరిపోతుంది. కృష్ణ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..