English | Telugu

అవినాష్ పెళ్లి ఫిక్స్‌!.. ఫోటో వైరల్!!

ఈ మధ్యకాలంలో బుల్లితెర తారలు తమ ఈవెంట్స్ ను, స్కిట్స్ ను సరికొత్తగా ప్రామిస్ చేసుకుంటున్నారు. పెళ్లి అయినట్లు, ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రాంక్ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ వర్ష‌ ఇలానే పెళ్లి చేసుకోబోతున్నట్లు పోస్ట్ లు పెట్టి హల్చల్ చేయగా.. అదంతా స్కిట్ కోసమని తెలుసుకున్న నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు.

ఇప్పుడు తాజాగా 'జబర్దస్త్' అవినాష్ కూడా ఇదే రూట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అనంతరం అవినాష్ స్టార్ మాలోనే పలు ఈవెంట్స్ చేస్తూ.. తన కామెడీ స్కిట్ లతో అలరిస్తున్నాడు. కామెడీ స్టార్స్ షోలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అవినాష్ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న అవినాష్ ని చూసిన వారంతా షాకయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు అవినాష్ పెళ్లి విషయంపై ఎంత రచ్చ చేశారో తెలిసిందే. అవినాష్ కూడా పెళ్లి ఎప్పుడు అవుతుందా అన్నట్లు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన్ను పెళ్లి గెటప్ లో చూసిన నెటిజన్లు 'పెళ్లి ఫిక్స్ అయిందా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం స్కిట్ కోసం ఇలా రెడీ అయి ఉంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. "ఈటీవీ వాళ్లు నీకు కూడా పెళ్లిచేస్తున్నారా బ్ర‌ద‌ర్ సెట్లో?" అని ఒక‌త‌ను అడిగాడు. మరి దీనిపై అవినాష్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి!


Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...