English | Telugu

కొడుకుతో రోజా డాన్స్.. వీడియో వైరల్!

సీనియర్ నటి రోజా ఓ పక్క రాజకీయాలు, మరోపక్క షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆమె తన కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని వాళ్ల కోసం ఇచ్చేస్తారు. కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు రోజా హాజరవుతుంటారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి షికార్లకు వెళ్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఇక జూన్ 27న రోజా తన కొడుకు కౌశిక్ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హార్స్‌లీ హిల్స్ లో ఈ వేడుక జరిగింది. భర్త సెల్వమణి, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అలానే కొడుకుతో కలిసి రోజా డాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో 'ప్రేమికుడు' సినిమాలోని 'ఊర్వశి' పాటకు కొడుకుతో కాలు కదిపారు రోజా. పాటకు తగ్గట్లుగా సింపుల్ స్టెప్పులతో డాన్స్ బాగా చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన రోజా ఆ మాత్రం డాన్స్ చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...