English | Telugu

'ఆర్ఆర్ఆర్' మీమ్‌.. నాకూ, ఈ ఘోరానికీ ఎలాంటి సంబంధం లేదు!

'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు టీజర్లకు విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ప్రకటిస్తూ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ బుల్లెట్‌ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనుక రామ్ చరణ్ కూర్చొని ఉన్నాడు.

ఆ బుల్లెట్ కూడా వెరైటీగా ఉండడంతో ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు. కానీ కొందరు మీమర్స్ మాత్రం ఈ పోస్టర్ ను బాగా వాడేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులైతే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు హెల్మెట్ పెట్టి ఈ పోస్టర్ ను ట్రాఫిక్ నిబంధనల కోసం వాడేశారు. అయితే ఇప్పుడు అదే పోస్టర్ తో 'కార్తీకదీపం' డాక్టర్ బాబుకి చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్లు.

డాక్టర్ బాబు బుల్లెట్ డ్రైవ్ చేస్తుంటే.. వెనుక దీపతో పాటు మోనిత కూడా కూర్చొని ఉన్నట్లుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఈ ఫన్నీ మీమ్ పై డాక్టర్ బాబు రియాక్ట్ అవుతూ.. 'ఇలాంటి పోస్టర్ ను ఎలా చేశార్రా బాబు. నాకు, ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు' అని తల బాదుకుని ఉన్న ఎమోజీను షేర్ చేశారు. ఇది నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...