English | Telugu

బతుకుదెరువులో మాత్రమే కమెడియన్స్ మి...మా జీవితంలో మేమే హీరోలం

టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చ రవి. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. తర్వాత కామెడీ షో ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో రచ్చ రవిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐతే రచ్చా రవి మూవీస్ లో కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి వాటిని ఎంచుకుంటూ వెళ్తున్నాడు. అంతే కాదు లైఫ్ మోటివేషన్ సబ్జెక్టు కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చెప్తుంటాడు. రచ్చ రవి రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసాడు.

అందులో కమెడియన్స్ లైఫ్ గురించి చెప్పాడు. "మీ ముందు మేము కమెడియన్స్ కావొచ్చు కానీ మా లైఫ్ లో మేమే హీరోస్ మీ..నాలుగు గింజల కోసం బ్రెడ్ అండ్ బటర్ కోసం మేము కమెడియన్స్ గా చేస్తాం కానీ మా లైఫ్ కి మేమే కథానాయకులం..మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని గుర్తుపట్టి మీ స్కిట్స్ బాగున్నాయి, బాగా చేశారు అని చెప్తూ ఉంటారు. బాధను వదిలేసి రెండు సెకన్లు మాతో మాట్లాడతారు. ప్రపంచంలో ఎవరైనా అదృష్టంగా భావించేది హాస్య నటుడిగా పుట్టడం. హాస్య నటుడిగా ఫుడ్ సంపాదించి ఫామిలీకి అందించడం. నాకు దేవుడు హాస్య నటుడిగా పుట్టించి అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే శత్రువులు లేనిది, పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక్క కమెడియన్ జీవితమే. అందుకే మేము అద్భుతంగా ఫీలవుతాం. " అని చెప్పాడు రవి. ఇక నెటిజన్స్ ఐతే "అన్న మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు కలమ్మ తల్లి ముద్దుబిడ్డ...చాలా బాగా చెప్పారు రవి బ్రో..సూపర్ అన్న" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.