English | Telugu
యష్ - వేదలకు మాళవిక వార్నింగ్!
Updated : Jul 23, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. కాంచన, మాలినిల ద్వారా వేద ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఇక రాదని తెలుసుకున్న ఖుషీ వెంటనే వెళ్లి వేదని ఇంటికి రమ్మంటుంది. నేను, నువ్వు, డాడీ మనం ముగ్గురం ఒక పార్టీ కదా ఎందుకు మమ్మల్ని వదిలేసి ఇక్కడికి వచ్చావ్? అంటూ నిలదీస్తుంది. ఆ తరువాత ఇంటికి రామ్మా అంటూ 1..2..3.. లెక్క పెడతాను.. నీకు ఇంటి రావాలని వుంటే నన్ను పిలువు లేదంటే వెళ్లిపోతాను అంటుంది. వేద స్పందించకపోవడంతో భారంగా అక్కడి నుంచి అపార్ట్ మెంట్ బయటికి వెళ్లిపోతుంది.
విషయం తెలిసి యష్ .. వేదని మందలిస్తాడు. తను అడిగినా రావా? అంటూ ఫైరల్ అవుతాడు. ఎందుకిలా చేస్తున్నావని ఆవేశంతో రగిలిపోతాడు. తనకు ఏదైనా జరిగితే నిన్ను క్షమించను అంటూ మండి పడతాడు. కట్ చేస్తే వేద.. యష్ ఇద్దరు కలిసి ఖుషీని వెతుక్కుంటూ మాళవిక, అభిమన్యుల వద్దకు వెళతారు. యష్ ఆవేశంతో అభిమన్యు కాలర్ పట్టుకుని ఖుషీ ఎక్కడ అని నిలదీస్తాడు. తనకు తెలియదని అభిమన్యు అనడంతో యష్ ఆవేశంతో ఊగిపోతాడు.
విషయం ఆర్థం కావడంతో మాళవిక రివర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఖుషీ నా కూతురు దాచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఖుషీ ఎక్కడుందో చెప్పండి.. గంట టైమ్ ఇస్తున్నాను. ఆలోగా ఖుషీ సేఫ్ అన్న న్యూస్ నా చెవినపడాలి. లేదంటే ఇద్దరిపై కేసు పెడతాను అంటూ యష్, వేదలకు మాళవిక వార్నింగ్ ఇస్తుంది.