English | Telugu
మార్చ్ 14 నుంచి మధురానగరిలో... డైలీ సీరియల్
Updated : Mar 9, 2023
బుల్లి తెర మీద కీర్తి భట్ అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. కార్తీక దీపం సీరియల్ లో అమాయకమైన ముఖంతో హిమ రోల్ లో నటించింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. తన ఫామిలీ మొత్తం తనకు దూరమైనా ఎక్కడా, ఎప్పుడూ బాధపడకుండా తన జీవితాన్ని ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకెళుతోంది. తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. 2017 వ సంవత్సరంలో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది.
ఇప్పుడు ఈమె మెయిన్ రోల్ లో నటించిన "మధురానగరిలో.." సీరియల్ మార్చ్ 14 నుంచి స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ మధ్యాహ్నం 2 కి తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేయడానికి రాబోతోంది. రియల్ లైఫ్ లో అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేదని కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి 'మధురానగరిలో' సీరియల్ లో ఓ బాబుకి అమ్మగా..రాధగా నటిస్తోంది. సీరియల్ లో భాగంగా మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటుంది. మంచి వాళ్లకు మంచి సంబంధాలు చూస్తూ...అబద్దాలు చెప్పేవాళ్లకు బుద్ది చెప్పే క్యారెక్టర్ లో నటిస్తోంది కీర్తి. మధురానగర్ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉండే రాధ తన జీవితాన్ని సంతోషాన్ని ఎలా కోల్పోయింది ? అనేది ఈ స్టోరీ. ఆల్రెడీ కీర్తి నటనను కార్తీక దీపంలో చూసిన ఆడియన్స్ ఆమెకు నూటికి నూరు మార్కులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సీరియల్ లో మలుపులు ఎలా ఉండబోతున్నాయి..కంటెంట్ ఎలా మెప్పించబోతోంది...కీర్తి నటన ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.