English | Telugu

రాహుల్ ప్రేమలీలలు.. స్వప్నకి నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో.. రాజ్ నిద్రనుండి లేస్తూ కావ్యని నిద్రలేపుతాడు. నేను గురక పెడుతున్నానా అని పదే పదే అడుగుతూ కావ్యని డిస్టర్బ్ చేస్తుంటాడు రాజ్. మరొకవైపు అపర్ణకి అరుంధతి ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం చూడమని చెప్తుంది. ఆ తర్వాత వెన్నెల గురించి అపర్ణ ఆలోచిస్తుంది.

ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి.. ఏంటీ అలా ఉన్నావని అడుగుతాడు.. వెన్నెల మంచి అమ్మాయి రాహుల్ కి మంచి అలవాట్లు లేవు.. తెలిసి తెలిసి రాహుల్ కి వెన్నెలని ఇచ్చి పెళ్లి చెయ్యడమా.. ఇప్పుడు నేను పెళ్లి ఆపితే రుద్రాణి నాపై ద్వేషం పెంచుకుంటుంది. పెళ్లి అయ్యాక రాహుల్ గురించి తెలిస్తే నా ఫ్రెండ్ కి నాకు మనస్పర్థలు వస్తాయని అపర్ణ అంటుంది. నువ్వు ఏం చేసావ్.. వాళ్లే సంబంధం కలుపుకోవడానికి వచ్చారు.. నువ్వు ఏం ఆలోచించకని అపర్ణని సుభాష్ అంటాడు.

మరొక వైపు రాహుక్-వెన్నెలల పెళ్ళి గురించి కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగానే.. స్వప్న తప్ప రాహుల్ బాధితులు వరుసగా రాహుల్ కి కాల్ చేస్తూ.. ఆ న్యూస్ నిజమేనా మన సంగతేంటని కాల్స్ చేస్తుంటారు. రాహుల్ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం కళ్యాణ్ విని.. కావ్యని తీసుకొని వస్తాడు. అలా రాహుల్ మాట్లాడే మాటలు చాటుగా వింటుంటారు.. రాహుల్ మాటలు విన్న కావ్య.. మా అక్కని ఒక్క దానినే చీట్ చేసాడనుకున్నాను.. ఆ లిస్ట్ లో చాలా మందే ఉన్నారని కళ్యాణ్ తో కావ్య అంటుంది. మా అక్కకి రాహుల్ తో పెళ్లి జరిపిద్దామని అనుకున్న కానీ ఫస్ట్ రాహుల్ ఇంత మందిని చీట్ చేసాడని నిరూపించాలని అనుకుంటుంది.

రాహుల్ కి శృతి అనే అమ్మాయి కాల్ చేసి.. నీ ఇంటిముందు ఉన్నానని అనగానే రాహుల్ కంగారుగా బయటకు వస్తాడు. రాహుల్ రావడం చూసి.. కళ్యాణ్, కావ్య లు కూడా వెనకాల వాళ్ళని చూస్తారు. నీతో మాట్లాడాలని ఆ అమ్మాయి అనగానే .. ఎవరైనా చూస్తారేమో అని ఆ అమ్మాయి ని బయటకు తీసుకెళ్తాడు. కావ్య, కళ్యాణ్ లు కుడా వాళ్ళని ఫాలో అయి వాళ్ళు మాట్లాడుకుందంతా వింటునే ఉంటారు.. నన్ను ఇంత మోసం చేస్తావా? వేరే పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయి రాహుల్ తో అనగానే.. అవును మోసం చేశాను.. వెన్నెల నీకంటే అందంగా ఉంటుంది.. కోట్ల ఆస్తి.. కావాలంటే నీకో ఆఫర్ ఇస్తాను.. పెళ్లి అయ్యాక కూడా మనం ఫ్రండ్స్ గా ఉండొచ్చు.. కాదని ఎక్స్ ట్రా చేస్తే నువ్వు ఉండవంటూ బెదిరించి వెళ్ళిపోతాడు రాహుల్.

ఆ అమ్మాయి అక్కడే ఏడుస్తూ ఉండగా.. కావ్య, కళ్యాణ్ లు ఆమె దగ్గరికి వస్తారు. ఎందుకు ఏడుస్తున్నావ్? అంత మోసం చేసిన వాడికి బుద్ది చెప్పాలని లేదా అని కావ్య అంటుంది. ఉంది మేడం కానీ నేను ఒక్క దాన్ని ఏం చెయ్యగలనని ఆ అమ్మాయి అనగానే.. మేం నీకు తోడుగా ఉంటాం వాడికి సరైన బుద్ది చెప్పాలని కావ్య అంటుంది. నువ్వు వాడితో కలిసి తీసిన ఫొటోస్ ఉంటే చెప్పమని కళ్యాణ్ అంటాడు. అలాంటివేం లేవని ఆ అమ్మాయి అంటుంది. గుర్తు చేసుకొని చెప్పు అని కళ్యాణ్ నెంబర్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎంగేజ్ మెంట్ కి అందరిని పిలిచాను.. ఈ రోజు కనకంని పిలువలని రుద్రాణి అనగానే.. అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.