English | Telugu

లాస్య మంజునాథ్ ఇక అన్నీ తినొచ్చంట!

యాంకర్ లాస్య.. అందరికి తెలిసిన సెలబ్రిటీ. ఒకప్పుడు అన్ని ఛానెల్స్ కి మోస్ట్ ఛాయిస్ లాస్య అని చెప్పొచ్చు. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య బిగ్ బాస్ సీజన్ -4 లో ఎంట్రీతో ఫామ్ లోకి వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వంట చేస్తూ అందరి కడుపునింపిన లాస్య.. టైటిల్ గెలవకపోయిన చివరికి వంటలక్కగా బయటకొచ్చింది. లాస్య తను షోస్ చేస్తున్నప్పుడు ఏనుగు, చీమ జోక్ లు చెప్తూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అయితే లాస్య, రవి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో పుకార్లు రావడంతో తను టీవీ రంగానికి దూరమైందని అనుకున్నారు. కానీ అదేదీ కాదని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని, రవి తన తప్పు తెలుసుకొని సారీ కూడా చెప్పాడని లాస్య ఒక ప్రోగ్రామ్ లో చెప్పింది. ఆ తర్వాత మంజునాథ్ ని పెళ్ళిచేసుకొని కొన్ని సంవత్సరాల పాటుగా బుల్లితెరకు దూరమైంది లాస్య.

లాస్య-మంజునాథ్ కి ఇద్దరు అబ్బాయిలు.. అయితే మళ్ళీ టీవి రంగంలోకి రావడానికి గతకొంతకాలంగా డైట్ ఫాలో అవుతుందంట. ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ని షేర్ చేసింది. ఇక ఆ డైట్ పూర్తయిందని వివరిస్తుంది లాస్య. ‌తన డైట్ చాలా కష్టంగా ఉండేదని.. రోజు ఫ్రూట్స్, సలాడ్స్, లిమిటెడ్ రైస్, చపాతీ, ఉడకబెట్టిన గింజలు లాంటివి తిని వ్యాయామం చేసేదానిని అంటూ చెప్పుకొచ్చింది. గుమ్మడి గింజలు, సొరకాయ ముక్కలు, బాదం, పాలకూర, పిస్తా, వాల్ నట్ సీడ్స్ అన్నీ మిక్స్ చేసి అదే ఇప్పుడు తినాలని , నాలుగు రోజులు రెగ్యులర్ డైట్, మూడు రోజులు మెంటెనెన్స్ డైట్ చేస్తున్నానని లాస్య అంది. తన మెంటెనెన్స్ డైట్ గురించి మొత్తం ఈ వ్లాగ్ లో షేర్ చేసింది. ఒకప్పుడు టీవీరంగంలో యాంకర్ గా రాణించిన ఈ లాస్య తన కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో లాస్య చేసిన ఈ వ్లాగ్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.