English | Telugu

లాస్యకి, తులసికి మధ్య టగ్ ఆఫ్ వార్

అంకిత బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి. లాస్య చాలా కాస్టలీ సారీ ఒకటి అంకితకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంతలో తులసి వాళ్ళ ఫామిలీ, ప్రేమ్ వాళ్ళ ఫామిలీ మొత్తం ఆ పార్టీకి వస్తారు. వాళ్ళను అసలు ఎవరు ఇన్వైట్ చేశారో తేలిక ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉంటారు. చివరికి తానె ఇన్వైట్ చేసినట్టు అంకిత చెప్తుంది. హైఫై సెలెబ్రేషన్స్ లో ఇలాంటి వాళ్ళు వస్తే ఏం బాగుంటుంది అంటూ అంకితను వాళ్ళ అమ్మ తిడుతుంది. వాళ్ళుంటేనే ఫంక్షన్ జరుగుతుందని అంకిత కూడా వార్నింగ్ ఇస్తుంది.

తులసి చేత్తో కుట్టిన శారీని అంకితకు గిఫ్ట్ గా ఇస్తుంది. కేక్ కటింగ్ కి ఆ సారీ కట్టుకుంటానంటుంది అంకిత. లాస్యకి బాగా కోపం వస్తుంది. అప్పు చేసి మరీ కాస్టలీ సారీ ఇస్తే తులసి ఇచ్చిన ఆఫ్ట్రాల్ సారీ కట్టుకుంటానంటుంది ఏమిటి అని నందుని అడుగుతుంది. ఫంక్షన్ కి పిలిపించుకుని మరీ వచ్చావా తులసి అంటూ లాస్య వెటకారమాడుతుంది. పిలుపు అందుకుని మరీ వచ్చాను.. ఏం లాస్య నీ కడుపు మండుతోందా అంటూ కౌంటర్ ఇస్తుంది తులసి. ప్రేమ్ అభి ఇద్దరూ మనసి విప్పి మాట్లాడుకుని ఆనందంగా ఉంటారు.

కలిసున్నప్పుడు కంటే విడిపోయినప్పుడే ప్రేమ్ మీ గురుంచి ఎక్కువగా ఆలోచిస్తున్నాడంటూ తులసికి శృతి చెప్తుంది. తులసి ఫంక్షన్ లో పాట పాడి అందరినీ ఆకట్టుకుంటుంది. గాయత్రీ మాత్రం తులసి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అభికి ఆస్తి వచ్చిన విషయం తెలిస్తే అంకితను పిచ్చిదాన్ని చేసి తులసి ఆస్తి నొక్కేస్తుందని భయపడుతూ ఉంటుంది గాయత్రీ. ఐతే మరో వైపు తన తల్లి అలాంటిది కాదని ఒక్క మాటన్నా చెప్తే బాగుండు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది గృహలక్ష్మి సీరియల్ లో ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే అప్ డేట్స్.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.