English | Telugu

శ్యామా కోసం ఎఫ్ ఎం స్టేషన్

ఫేక్ రేటింగ్స్ క్రియేట్ చేసి ఆ చార్ట్ ను శ్యామాకు చూపిస్తుంది సౌజన్య. అది చూసి షాక్ అవుతుంది కృష్ణతులసి. ఎందుకిలా జరిగింది అని అడుగుతుంది. అనంతశయనం గారికి ఈ రేటింగ్స్ పంపించామని ఆయన ఇక తనని జాబ్ కి రావద్దన్నారని చెప్తుంది సౌజన్య. కృష్ణ తులసి చాలా బాధ పడుతుంది. వెంటనే రిజైన్ చేసి వెళ్లిపొమ్మన్నారని చెప్పి లెటర్ రాయించి సంతకం తీసుకుంటుంది. తర్వాత కృష్ణతులసి సెల్ లో ఉన్న ఆఫీస్ సిమ్ కూడా ఇచ్చేయమని చెప్పి తీసేసుకుంటుంది.

ఏం చేయాలో తెలీక శ్యామా ఇంటికి దిగాలుగా వచ్చి కూర్చుంటుంది. ఐశ్వర్య శ్యామాను చూసి ఎందుకలా ఉన్నావంటూ ఆరా తీస్తుంది. కానీ మనసులో జాబ్ పోయిన విషయం తెలిసినా ఏమీ తెలియనట్టు అడుగుతుంది. జాబ్ పోయింది అని చెప్తుంది శ్యామా. ఐతే జాబ్ పోయిన విషయం తన మీద రాకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి అత్తగారు కానీ ఇలా చేసి ఉంటారా ? అనే అనుమానాన్ని బయట పెడుతుంది. అఖిల్ తో జాబ్ చేయమని చెప్పి వెనక నుంచి ఇలా జాబ్ తీయించేసారేమో అని అంటుంది..

అత్తగారు అలా చేయరని చెప్తుంది శ్యామా. ఇంతలో విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అనంతశయనంతో నేను మాట్లాడతాను అంటూ వర్మ అంటాడు. పోనీ జాబ్ పొతే పోయింది. నేనే నీకోసం ఒక ఎఫ్ ఎం స్టేషన్ పెట్టిస్తాను. చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నీకు నచ్చినట్టు నువ్వు వుండు అని శ్యామాకు అభయమిస్తాడు. ఇక మిగతా ఎపిసోడ్ అంతా ఈ రోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణ తులసిలో చూడొచ్చు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.