English | Telugu

ఆదర్శ్ ఫోటోని చూడకుండా మురారిని చూసిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది?

ఆదర్శ్ ఫోటోని చూడకుండా మురారిని చూసిన ముకుంద.. కృష్ణ ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -271 లో.. మధు పరుగెడుతుండగా అనుకోకుండా కృష్ణ చెయ్యికి తగిలి.. కృష్ణ చేతిలోని ప్రసాదం కిందపడిపోతుంది. అలా ప్రసాదం కిందపడడం చూసిన కృష్ణ బాధపడుతుంది. అప్పుడే మురారి వస్తాడు. ప్రసాదం కింద పడిఉండడం చూసిన మురారి.. ఏమైందని అడుగుతాడు. నా వల్లే అలా జరిగిందని సారీ చెప్తాడు మధు.

ఆ తర్వాత నా చేతిలో ఉన్న ప్రసాదం తీసుకొని తినండని ముకుంద చెప్పగానే.. కృష్ణ ప్రసాదం తీసుకొని మురారికి తినిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద తను కొంచెం చేతిలో పట్టుకున్న ప్రసాదం తింటుంది. మురారి తినగానే ముకుంద తినడం గమనించిన కృష్ణ.. అనవసరంగా ముకుంద దగ్గర ప్రసాదం తీసుకున్నా అని అనుకుంటుంది. నీ సంగతి చెప్తానని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత భర్తల దినోత్సవానికి కృష్ణ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాసేపటికి మురారికి సన్మానం చేసి తనకి నచ్చిన విషయాలు అన్ని చెప్తుంది. అలా అన్నీ చెప్పి మురారికి కృష్ణ మాటిస్తుంది. మిమ్మల్ని ఏ సిచువేషన్ లో అయిన వదిలిపెట్టనంటూ మురారి చేతిలో చేయి వేసి చెప్తుంది. అదంతా చూస్తున్న రేవతి సంబరపడిపోతుంది. ఆ తర్వాత ముకుందని ఆదర్శ గురించి చెప్పమని అనగానే.. ఆదర్శ పేరు వాడుతు మురారి గురించి చెప్తుంది‌. మురారిని ఉహించుకొని ముకుంద డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత మధు గురించి అలేఖ్యని చెప్పమంటే.. మధు అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడంటూ మొత్తం నగల గురించి చెప్తుంటే అందరు నవ్వుతారు.

ఆ తర్వాత ప్రసాద్ గురించి సుమలత చెప్పి.. ప్రసాద్ ని సన్మానిస్తుంది. కాసేపటికి కృష్ణ చందమామని చూసి జల్లేడ లో నుండి మురారిని చూస్తుంది. అలాగే  ప్రసాద్ ని సుమలత చూస్తుంది. ఆదర్శ్ ఫోటోని మధు తీసుకొని వచ్చి చందమామని చూసి జల్లెడ నుండి ఆదర్శ ఫోటో చూడమని అంటాడు. ఆదర్శ ఫోటో నువ్వు పట్టుకోవడం కంటే మురారి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మురారి పట్టుకోవాలని అలేఖ్య అనగానే.. ఆదర్శ్ ఫోటో మురారి పెట్టుకుంటాడు. అయితే ముకుంద చందమామని చూసి ఆదర్శ్ ఫోటో చూడకుండా మురారిని జల్లెడలో నుండి చూస్తుంది. అలా మురారిని ముకుంద చూడడం కృష్ణ గమనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.