English | Telugu

రౌడీకి డబ్బులిచ్చిన శైలేంద్ర మాస్టర్ ప్లాన్ అదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -877 లో.. జగతి ఎలాగైనా రిషితో నిజం చెప్పాలని అనుకొని రిషికి ఫోన్ చేస్తుంది. కానీ జగతి చేస్తుందని రిషి ఫోన్ కట్ చేస్తుంటాడు. అయిన జగతి మళ్ళీ మళ్ళీ చేసేసరికి రిషి కోపంగా లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. నీతో మాట్లాడాలి. చాలా నిజాలు కలిసి చెప్పాలని జగతి అనగానే.. లేదు నేను రానని రిషి చెప్తాడు.

నేను చెప్పేది వినే సిచువేషన్ లో రిషి లేడు. ఇప్పుడు నేనేం చెయ్యాలని జగతి బాధపడుతుంది. కాసేపటికి పేపర్ పై జరిగింది మొత్తం జగతి రాస్తుంది. శైలేంద్ర చేసిన కుట్రలు అన్ని లెటర్ లో రాస్తుంది. మరొక వైపు రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. మేం వారం రోజులు ఊరు వెళ్తున్నాం, కాలేజీ జాగ్రత్త అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రిషి కాలేజీకి వెళ్తాడు. డల్ గా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండడం గమనించిన వసుధార.. ఏమైందని అడుగుతుంది. కాలేజీ లో ఏమైన ప్రాబ్లమ్ ఉందా? మీ మేడమ్ ఫోన్ చేసారా అని వసుధారని రిషి అడుగుతాడు. నాకేం ఫోన్ చెయ్యలేదు అని వసుధార అనగానే నాకు ఫోన్ చేసిందని రిషి చెప్తాడు. మరొక వైపు ఒక అబ్బాయికి తను రాసిన లెటర్ ని ఇచ్చి పోస్ట్ చెయ్యమని చెప్తుంది జగతి. అప్పుడే మహేంద్ర వచ్చి ఏంటని అడుగుతాడు. రిషి నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అందుకే రిషి దగ్గర దాచిన నిజాలన్ని ఆ లెటర్ లో రాసానని మహేంద్రతో చెప్పడం శైలేంద్ర వింటాడు. మరొక వైపు ఎందుకు జగతి మేడమ్.. నాతో మాట్లాడాలని అనుకున్నారు. ఒకసారి కలిసి మాట్లాడదామని ఎందుకు అన్నారని జగతికి ఫోన్ చేసి రిషి అడుగుతాడు. ఫోన్ లో కాదు కలిసి మాట్లాడుతా అని జగతి అనగానే.. రిషి సరే అంటాడు.

మరొకవైపు రిషికి పిన్ని నిజం చెప్పబోతున్నా అని సంబరపడిపోతున్నావా? నీకు ఆ అవకాశం ఇవ్వనని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర రౌడీని కలిసి అతనికి డబ్బులు ఇస్తాడు. రౌడీతో శైలేంద్ర మాట్లాడడం ధరణి చూస్తుంది.. ఆ తర్వాత అతనికి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏం చేస్తున్నారని శైలేంద్రని ధరణి అడుగుతుంది. నీకు అనవసరమంటు ధరణిపై శైలేంద్ర కొప్పడతాడు. ఆ తర్వాత వసుధారకి ధరణి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.