English | Telugu

స్వప్నని కిడ్నాప్ చేసి చంపేయమన్న రాహుల్!

స్వప్నని కిడ్నాప్ చేసి చంపేయమన్న రాహుల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -210 లో.. స్వప్న తన కడుపు పెరిగిందని, ఆ విషయం అందరు అనుకోవాలని బెల్ట్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత రాహుల్ రాగానే.. నాలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అని అంటుంది. రాహుల్ స్వప్న కళ్లకు ఉన్న కాటుక తీసి దిష్టి పెడతాడు. నా పై ఎలాంటి డౌట్ రాలేదు. ఇక నేను ఇప్పుడు ఇంటికి వెళ్లొచ్చని అనుకోని ఇక ఇంటికి వెళదామని రాహుల్ కి చెప్తుంది. మనం ఊటీలో ఉన్నామని తెలుసు ఇప్పుడు సడన్ గా వెళ్తే ఇక్కడే ఉన్నామని తెలిసిపోతుందని రాహుల్ అంటాడు.

మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదని అపర్ణ కోపంగా ఉంటుంది. అపర్ణకి ఇంక కోపం వచ్చేలా రుద్రాణి మాట్లాడుతుంది. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి వస్తారు. నిన్న వస్తానని చెప్పారు. ఇప్పుడు తీరిగ్గా వస్తున్నారా అని కావ్యపై అపర్ణ కోప్పడుతుంది. లేట్ గా వస్తే ఏమైంది గొడవ చేయకండని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఎందుకు లేట్ గా రావాల్సి వచ్చిందో కావ్య జరిగిందంత చెప్పగానే అందరు షాక్ అవుతారు. రాజ్ రౌడీలని కొట్టి విగ్రహలు తీసుకొని వచ్చాడని చెప్పగానే, అందరు రాజ్ ని మెచ్చుకుంటారు. కానీ అపర్ణ మాత్రం  రాజ్ కి ఏదైనా ఐతే నీ వల్లే ఇదంతా అని కావ్యని తిడుతుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ పూర్తి అయింది‌. ఇంటి కాగితాలు రాజ్ చేతుల మీదుగా తీసుకోవాలని మా వాళ్ళు అనుకుంటారని సీతరామయ్యకి కావ్య చెప్తుంది. రాజ్ మొదట ఒప్పుకోడు కానీ ఆ తర్వాత సీతరామయ్య చెప్పగానే సరేనంటాడు.

మరొక వైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. రాజ్ హీరో లాగా రౌడీలను  కొట్టి విగ్రహలు తీసుకొని వచ్చాడట. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని రుద్రాణి చెప్తుంది.  నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ నేను లేను కాబట్టి ఆలా జరిగింది. ఇక్కడ నేను ఉన్నాను. స్వప్న విషయం లో ఫెయిల్ అవదని రుద్రాణికి రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత స్వప్నని ముందు ప్రేమించిన మైఖేల్ కి ఫోన్ చేసి తనని కిడ్నాప్ చేసి చంపెయ్యాలని రాహుల్ చెప్తాడు. దానికి మైఖేల్ సరే అంటాడు. మరొక వైపు రాజ్ చేసిన హెల్ప్ కి కావ్య థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత రాజ్ బొద్దింకని చూసి రాజ్ భయపడతాడు. అది చుసిన కావ్య.. రాజ్ ని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.