English | Telugu

Krishna Mukunda Murari : నిజంగానే ఆమె కడుపుతో ఉందా.. కంగారుపడుతున్న భవాని! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -472 లో.... కృష్ణ, మురారీలు కలిసి మీరాతో మాట్లాడుతుంటారు. చూడండి మురారీ గారు.. నేనో అనాథను. అలాంటి నన్ను తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేస్తా అని భవాని గారు అంటుంటే.. ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దని చెప్పలేను.. మీరే ఈ పెళ్లి ఆపాలి. ఏది ఏమైనా నాకు ఈ పెళ్లి వద్దని నేను చెప్పను.. ఆ ఆశలేం పెట్టోకండి. నేను టెన్షన్ పడకుండా ఉంటేనే నా కడుపులో మీ బిడ్డ బాగుంటుంది. ఏదైనా సరే త్వరగా ఆలోచించి పెళ్లి ఆపండి అంటూ ఏడుస్తున్న ముఖం పెట్టి జాలి కలిగేలా మాట్లాడేసి మీరా వెళ్లిపోతుంది.

ఈ మీరా నటిస్తోంది ఏసీపీ సర్.. అయితే మన దగ్గరైనా నటించాలి. లేదా భవాని అత్తయ్యా, ఆదర్శ్‌ల దగ్గరైనా నటిస్తుండాలని కృష్ణ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ కృష్ణ.. తను మన బిడ్డను మోస్తుంది. ఇందులో నటించడానికి ఏముందని మురారి అంటాడు. దాంతో కృష్ణ మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు రేవతితో భవాని మాట్లాడుతుంది.. పెళ్లి విషయంలో కృష్ణ హ్యాపీగా లేనట్లుంది అక్కయ్యా.. ఇప్పుడు తనకు రెస్ట్ అవసరం కదా.. అది మిస్ అవుతుందని ఫీల్ అవుతుందేమోనని భవాని అంటుంది. ఇంతలో భవాని ముందుకు మధు ఓ వ్యక్తిని తీసుకొస్తాడు.. పెళ్లి ఈవెంట్ మేనేజర్ పెద్దమ్మా.. అన్నే చేసి పెడతాడని అంటాడు. నీ పేరు ఏంటయ్యా అని భవాని అడుగగా.. పనిలేని సుధాకర్ మేడమ్ అని అతను అంటాడు. పని లేకపోవడమేంటి.. బాగానే చేసుకుంటున్నావ్ కదా అని భవాని అంటుంది. అది మా ఇంటి పేరు మేడమ్.. ఇప్పుడు అక్కినేని.. మిక్కిలినేని.. బాలనేని.. ఉన్నప్పుడు పనిలేని ఉండకూడదా మేడమ్ అని అతను. దాంతో కృష్ణ, మురారీ కూడా నవ్వుతారు. సరే అయితే వెళ్లి చక్కగా పని చెయ్ పనిలేని సుధాకర్ అని భవాని అనగానే అతడు వెళ్లిపోతాడు. అది గమనించిన మీరా.. అంతా వెళ్లిపోయాక మురారీ, కృష్ణలకు దగ్గరకు వచ్చి.. నిజం భవాని మేడమ్‌కి చెప్పేశారా.. సంతోషంగా కనిపిస్తున్నారని అంటుంది. లేదు మీరా.. నువ్వు కంగారు పడొద్దు.. టైమ్ చూసుకుని చెబుతాం అంటాడు మురారీ. దాంతో మీరా వెళ్లిపోతుంది. చూశావా కృష్ణ.. మీరా ఎంత కంగారుపడుతుందో.. నువ్వేమో తనని అనుమానిస్తున్నావని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ మౌనంగానే ఉంటుంది. ఇక రాత్రి అయ్యేసరికి మీరా, సంగీత, కృష్ణ, మురారీ, మధు, రజినీ తింటూ ఉంటారు. ఆదర్శ్ ఇంకా రాలేదని మధు ఎదురు చూస్తుంటాడు‌ ఇంతలో మీరాకు వాంతులు అవుతాయి. మురారి కంగారుగా వెళ్లి చెవులు మూస్తాడు. ఇక రజని వెటకారంగా.. కడుపుతో ఉన్నది ఒకరు.. వాంతులు చేసుకునేది ఒకరని అంటుంది.

ఇంతలో ఆదర్శ్ వస్తాడు. మీరా వాంతులు చేసుకోవడం చూసి.. కంగారుపడతాడు. వాటర్ తాగిస్తాడు. అది చూసిన భవాని.. రజని అన్నట్లు మీరా కూడా కడుపుతో ఉందా.. దానికి కారణం ఆదర్శా అని కంగారుపడుతుంది. తరువాయి భాగంలో కృష్ణను భవాని పిలిచి.. మీరా తల్లి కాబోతుంది కృష్ణ.. నమ్మడం లేదా.. నేను చెప్పేది నిజం.. కావాలంటే నువ్వు డాక్టర్‌వే కదా.. ఒకసారి చెక్ చేసి చూడు అంటుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది. చాటుగా మీరా విని సంతోషపడుతుంది. మరి భవానీ దేవికి ఈ నిజం ఎలా తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.