English | Telugu

హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై తెలుగమ్మాయి!

ఓ వంటనూనె ఆడ్ లో మెరిసిన తెలుగమ్మాయి.. మాడలింగ్ రంగంలో రాణిస్తోంది. తను ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది. చిన్న వ‌య‌సులోనే న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ఆమె మ‌రెవ‌రో కాదు హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు. సూప‌ర్ స్టార్‌ మహేశ్‌ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్ర‌స్తుతం హాలీవుడ్‌ లో అదరగొడుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి నెలలో ' బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ' అనే వెబ్ సిరీస్ లో అవంతిక నటించింది. దాంతో హాలివుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి.‌ ఇప్పుడు ఏకంగా గలొరి మ్యాగజైన్ కవర్ పేజీపై స్టన్నింగ్ లుక్స్ లో కన్పించి అందరిని ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందిరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవంతిక ఇటీవ‌ల 'మీన్ గర్ల్స్' అనే హాలీవుడ్ చిత్రంలో న‌టించ‌గా ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుత టీనేజ్ యువ‌త ఆలోచనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఈ తెలుగ‌మ్మాయి ఏకంగా ఒక ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చింది. మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై ఊహించని లుక్‌లో ఆమె క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్‌ని హైలైట్ చేసే 'గలొరి' మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక వందనపు ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గ్రే క‌ల‌ర్ హెయిర్, గ్రే క‌ల‌ర్ డ్రెస్‌లో హాలీవుడ్ హీరోయిన్‌లా ఆమె మెరిసిపోతోంది. ఇలా డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్న అవంతిక‌ను చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.