Read more!

English | Telugu

ఊహించని మలుపులతో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -67 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి రెడీ అయి కిందకి వస్తారు. ఇంకా ఎవరు రెడీ కాలేదని అందరిని పిలుస్తారు. అందరు రెడీ అయి కిందకి వస్తారు. సిరి పెళ్లికూతురు లాగా చీరకట్టులో వచ్చేసరికి అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అసలు ఎప్పుడు ఇలా రెడీ అవ్వవు.. ఎందుకు ఈ రోజు రెడీ అయ్యావని శ్రీలత అడుగుతుంది. నేనే రెడీ అవ్వమని చెప్పానని సీతాకాంత్ చెప్తాడు.

సీతాకాంత్ ఏదో ప్లాన్ చేసాడని శ్రీలత అనగానే.. సిరిని అలా రెడీ అవ్వమని చెప్పాలిసిన అవసరం ఏం ఉంది. అన్నయ్య ఏం ప్లాన్ చేసాడంటావని సందీప్ అంటాడు. మనం రామలక్ష్మి, సీతాకాంత్ లు పెళ్లి చేసుకోలేదని నిజం బయటపెట్టాలి. అలాగే సిరిని ఓ కంట కనిపెట్టాలని సందీప్ కు శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన ఫ్యామిలీని తీసుకొని గుడికి వెళ్తాడు. కాసేపటికి మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని వస్తాడు. మాణిక్యాన్ని చూసిన శ్రీలత షాక్ అవుతుంది. సిరి చీర కట్టులో రావడం చూసి మాణిక్యం షాక్ అవుతాడు. సీతాకాంత్ ఏదో ప్లాన్ చేసి వచ్చాడని మాణిక్యం అనుకుంటాడు. మీ కోసం వెయిటింగ్ అని సీతాకాంత్  అంటాడు. మాణిక్యంతో సీతాకాంత్ వెటకారంగా మాట్లాడేసరికి మాణిక్యం మరింతగా షాక్ అవుతాడు.

ఆ తర్వాత సీతాకాంత్ అందరిని తీసుకొని స్వామిజీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రామలక్ష్మిని పరిచయం చేస్తుంటే.. తను నీ ధర్మపత్ని అని స్వామి అనగానే.. అదేంటి మేం భార్యభర్తలు కాదన్న విషయం స్వామికి తెలిసే ఉంటుంది. అయినా ఎందుకు ఇలా అంటున్నారని సీతాకాంత్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మాణిక్యం గురించి చెప్తాడు. నీ గురించి మొత్తం తెలుసు అలాగే నువ్వు చేసిన కుట్రలు.. అది చేయించినవారు కూడా తెలుసని అనగానే శ్రీలత  టెన్షన్ పడుతుంది.‌ ఆ తర్వాత ధన దగ్గరికి వెళ్లిన మాణిక్యం.. సిరితో నీ పెళ్లి చేస్తారేమోనన్న డౌట్  ఉంది. నువ్వు నాకు వెన్నుపోటు పొడవకని ధనతో మాణిక్యం చెప్తాడు. ఆ తర్వాత ఈ ఇంటి కొడలు హారతి ఇవ్వాలని శ్రీలత అనగానే రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.