English | Telugu

నా సంతోషాన్ని నువ్వే తీసుకెళ్ళావ్ నాన్న.. నయని పావని మోస్ట్ ఎమోషనల్ పోస్ట్!

ప్రతీ ఒక్కరి జీవితంలో కొత్త సంవత్సరం మారుతున్నప్పుడు ఒక్కసారిగా వారి లైఫ్ లో‌ ఈ సంవత్సరం ఏం జరిగిందనే ఆలోచన వస్తుంది‌. అయితే ఈ ఆలోచనలలో కొన్ని ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలుంటాయి. అలా మరచిపోలేని జ్ఞాపకాలలో వాళ్ళ నాన్న ఒకరని బిగ్ బాస్ సీజన్‌-7 కంటెస్టెంట్ నయని పావని తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. వాళ్ళ నాన్న ఫోటో పోస్ట్ చేసి కొన్ని ఎమోషనల్ మాటలని షేర్ చేసుకుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆరవ వారం నయని పావని ఎలిమినేట్ అయి బయకొచ్చింది. పోటుగాళ్ళుగా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్, అశ్విని, నయని, పూజా మూర్తి, భోలే శావలి నుండి నయని పావని ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన నయని మోస్ట్ ఎమోషనల్ అయింది. ‌ఇక నాగార్జున తన జర్నీ వీడియో చూపించి, తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడించాడు. ఇక ఒక్కో హౌస్ మేట్ గురించి మాట్లాడుతూ నయని ఏమోషనల్ అయిన విషయం తెలిసిందే. హౌస్ లోని వాళ్ళంతా తనతో ఎలా ఉన్నారో చెప్పుకుంటూ ఏడ్చేసిన నయనిని చూసి ప్రేక్షకులకి గీతు రాయల్ గుర్తొచ్చింది. అయితే ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకొచ్చి‌న నయాని అందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడింది.

శివాజీ గురించి మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది నయని. "శివాజీ గారిని చూడగానే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు సర్. రోజు పొద్దున్నే వెళ్ళి డాడీకి హగ్ ఇచ్చి నా డే స్టార్ట్ చేస్తాను సర్" అని నాగార్జునతో నయని అంది‌. ఐ మిస్ యూ డాడీ అని శివాజీతో నయని అనగానే శివాజీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక శివాజీ ఎమోషనల్ అవుతూ.‌. " నాకు కూతురు లేదు సర్. తనలో నేను కూతురిని చూసుకున్నాను. నన్నే డాడీ అనుకో అని తనతో చెప్పాను. సర్ తన బదులు నేను బయటకు రావొచ్చా సర్. నాకు చేయి నొప్పి కూడా ఉంది " అంటూ శివాజీ ఎమోషనల్ గా చెప్పగా.. ఆడియన్స్ ఓటింగ్ ని మనం మార్చలేం కదా శివాజీ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత నయని పావని ఎలిమినేషన్ అయి బయటకి వెళ్లింది. ఇక నాగార్జున, ఒక కంటెస్టెంట్స్ బయటకు వెళ్తుంటే ఇంతమంది బాధపడటం ఫస్ట్ టైమ్ చూస్తున్నానని అన్నాడు.

ఇక ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది నయని పావని. గత సంవత్సరం డిసెంబర్ 31st కి వాళ్ళ నాన్నని మిస్ అయినట్టుగా, తన చిన్నతనంలో నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. నువ్వు లేకుండా నేను ఇంత స్ట్రాంగ్ ఉండేదానిని కాదు నాన్న.. నువ్వు లేకుండా నా లైఫ్ ఎలా ఉండేదో అసలు ఊహించుకోలేను.. ఒక వ్యక్తిగా నేనెంత స్ట్రాంగ్ గా ఉన్నా నేనెప్పుడూ నీకు చిన్న పాపనే.. ఈ భాదని ఎవరు ఫిక్స్ చేయలేరు. నా సంతోషాన్ని నువ్వే తీసుకెళ్ళావ్ నాన్న .. లవ్ యూ నాన్న అంటు నయని చేసిన ఈ పోస్ట్ మోస్ట్ ఎమోషనల్ గా ఉంది. కాగా నెటిజన్లు ఈ ఫోటోని చూసి తెగ కామెంట్లు చేస్తున్నారు.