English | Telugu

Guppedantha Manasu : ఆ ఇద్దరే ఇంటిదొంగలని ఫణీంద్రకి తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -991 లో.. భద్రని కస్టడీ నుండి తప్పించాననే ఆనందాన్ని దేవయానితో శైలేంద్ర షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు తప్పించావ్ ఒకే గాని మళ్ళీ దొరికితే మాత్రం మన గురించి చెప్పేస్తాడు కదా అని దేవయాని అంటుంది. లేదు వాడు ఉంటేనే కదా అని శైలేంద్ర అనగానే.. అంటే చంపేసావా అని దేవయాని అడుగుతుంది. లేదు జెస్ట్ కస్టడీ నుండి తప్పించాను.. వాడు ఇక ఎటు వెళ్తే మనకేంటని శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత ఆ వసుధార సంగతి ఏంటి? ప్రతిసారి నీ ఎండీ సీట్ కీ అడ్డుగా వస్తుందని దేవయాని అనగానే...చంపేస్తానని శైలెంద్ర అంటాడు. వాళ్ళ మాటలన్నీ విన్న ధరణి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు రిషి ఆచూకి తెలియకపోవడమేటని అనుపమ ముకుల్ ని అడుగుతుంది. అసలు ఎవరు తీసుకొని వెళ్లారని అడుగుతుంది. కాస్త ఇబ్బంది పడుతు.. అది తర్వాత కానీ ఫస్ట్ మహేంద్ర గారు హాస్పిటల్ కి రావలిసి ఉంటుంది. చిన్న బాడీ ఐడెంటిఫికేషన్ అని ముకుల్ అనగానే.. అందరూ షాక్ అవుతారు. అలా మాట్లాడుతారేంటి? నేను రానని మహేంద్ర అంటాడు. నా రిషి కాదు నా రిషి బాగుంటాడని మహేంద్ర ఆవేశంగా మాట్లాడుతాడు. నేను క్లారిటీ గా చెప్పట్లేదు. మీరు ఒక్కసారి చుసి చెప్పండని ముకుల్ అంటాడు. కానిస్టేబుల్ ని ముకుల్ పిలుస్తాడు. అతను ఒక టీ షర్ట్ తీసుకొని వస్తాడు‌. ఇది రిషీదేనా అని ముకుల్ వాళ్ళని అడుగగా.. అవును ఇది రిషిదే.. ఇదే వేసుకున్నాడని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత ముకుల్ తో హాస్పిటల్ కి వెళ్తాడు..ఆ తర్వాత వసుధార జగతి ఫోటో దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.

మరొకవైపు ఫణీంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు. ఏమైంది ఆలా ఉన్నారని దేవయాని వచ్చి అడుగుతుంది. మహేంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడo లేదని చెప్తాడు. తర్వాత చూసుకొని చేస్తాడు‌లే.. దానికి ఎందుకు టెన్షన్ అని దేవయాని అంటుంది. ఆ తర్వాత అనుపమకి ఫణింద్ర ఫోన్ చేసి మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చెయ్యడం. లేదు అనగానే.. అనుపమ మహేంద్ర హాస్పిటల్ కి వెళ్ళాడంటూ ముకుల్ చెప్పింది మొత్తం ఫణింద్రకి చెప్తుంది. ఆ తర్వాత రిషికి ఏం కాకూడదంటూ ఫణీంద్ర టెన్షన్ పడతాడు. రిషికి ఏం కాదంటూ దేవాయని, శైలెంద్రలు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ధరణి చూడలేకపోతుంది. శైలెంద్ర మాత్రం మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.