English | Telugu
Krishna Mukunda Murari:భవానికి సవాలు విసిరిన మురారి.. ఏం జరుగనుందో తెలుసా?
Updated : Dec 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -353 లో.. కృష్ణకి కాలు బెణికి నడవరాకపోవడంతో స్వయంగా మురారీనే తన కాలుకి మసాజ్ చేస్తూ తన దగ్గరే ఉంటాడు. మురారి తనని ప్రేమగా చూసుకోవడం చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దమ్మకి ఈ విషయంలో నీ ప్రమేయం ఏమి లేదని తెలిస్తే ఆదర్శ్ ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుందని, ఏం టెన్షన్ పడకని మురారి చెప్తాడు.
మరొకవైపు దేవ్ ఇంకా రావడం లేదని ముకుంద టెన్షన్ పడుతుంది. అప్పుడే దేవ్ వస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయిందని ముకుంద అడుగుతుంది శ్రీనివాస్ కాల్ చేసాడని అనగానే.. ఎవరైన కన్నతండ్రిని పేరు పెట్టి పిలుస్తారా అని ముకుంద అనగానే.. కన్నతండ్రిగా నీకు ఏం చేశాడని దేవ్ అడుగుతాడు. తను సక్రమంగా చేస్తే నేను ఇదంతా చేసే అవసరం ఉండేది కాదని దేవ్ అంటాడు. ఆ తర్వాత ముకుంద టెన్షన్ పడుతుంటే.. ఏం టెన్షన్ పడకు అని చెప్తాడు. మురారిని మాటల్లో పెట్టి మురారి రాకుండా చూడు మిగతాది నేను మ్యానేజ్ చేస్తానని దేవ్ అంటాడు. అసలు మురారి నా మాట వింటాడా అని ముకుంద అనగానే.. నువ్వు మురారిని ప్రేమిస్తున్నావ్. ఎందుకు మాలాగా ఎప్పుడు అతనికి దూరంగా ఉంటావ్. అతను ఎంత మంచి వాడైన మగాడు ఇంతకు మించి నేను ఎక్కవ ఏమి చెప్పలేనని ముకుందతో దేవ్ చెప్తాడు. మరొకవైపు నందు, రేవతి కలిసి కృష్ణ, మురారీల గురించి మాట్లాడుకుంటు ఉంటే అప్పుడే మురారి వస్తాడు. నిన్ను పెద్దమ్మ రమ్మని చెప్పిందని మురారికి రేవతి చెప్తుంది. ఆ కృష్ణని ఇంట్లోకి రావద్దని చెప్తుంది కావచ్చని రేవతి అనగానే.. అలా ఎలా చెప్తుంది నేను ముందే చెప్పాను కదా.. కృష్ణ ఇంట్లోకి వస్తుందని అని మురారి అంటాడు.
అ తర్వాత భవాని దగ్గరకి మురారి వెళ్తాడు. అప్పుడు మురారి గతం మర్చిపోయినప్పుడు తను పడ్డ బాధని గురించి మురారి చెప్తు ఏడుస్తుంది. నువ్వు బాధపడడానికి కారణం అయిన వాళ్ళని మాత్రం వదిలి పెట్టనని మురారి అంటాడు. నీకు వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళని శిక్షించడం నీకు నిమిషాలలో పని కానీ నువ్వు అది చెయ్యట్లేదని భవాని అంటుంది. కృష్ణ ఏం తప్పు చేయలేదని తెలిస్తే నువ్వు గెలిచినట్లేనని మురారి అంటాడు. మరొకవైపు నందు, రేవతి దగ్గరకి కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత దేవ్ వస్తాడు. కృష్ణని దేవ్ కిట్టమ్మ అని పిలుస్తాడు. అలా పిలువడంతో మా నాన్న, చిన్నాన్న కూడా అలాగే పిలిచేవాళ్ళని కృష్ణ అంటుంది. దేవ్ అన్నయ్యని మధు ఎందుకు అపార్థం చేసుకుంటున్నాడని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.