English | Telugu

ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్!

విజయవాడలో పుట్టిన మంగళంపల్లి శ్రీసత్య అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ శ్రీసత్య అంటే తెలిసిపోతుంది. విజయవాడలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన శ్రీసత్య హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. అక్కడే తన కెరీర్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై అవకాశాల కోసం వెతుకుతున్న టైములో వెండితెర ఛాన్స్ వచ్చింది. "నేను శైలజ" మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి బాగా ఫేమస్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 6లో యాక్టివ్ గా యాక్టివ్ గా ఉంటూ చికెన్ కావాలంటూ ఆమె చేసిన అల్లరి ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది. గతంలో కొన్ని సీరియల్స్ లో చేసింది శ్రీ సత్య. ఐతే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కాన్సంట్రేషన్ చేసింది. 'డీజే టిల్లు 2'లో కనిపించనున్నట్లు ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది అని అలాగే మరో మూవీ షూటింగ్ కి అమెరికా వెళుతున్నట్లు చెప్పింది. ఐతే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేసింది. మన్మధుడు మూవీలో నాగ్ చెప్పే పెళ్లి సలహాని రీల్ గా చేసింది.."ఒక్క విషయం విను సుబ్బారావు..పెళ్లంటే నూరేళ్ళ పంట కాదు ఎవ్రీ డే మంట" అని చెప్పింది శ్రీసత్య. ఇక ఆ వీడియోకి నెటిజన్స్ చాల కామెంట్స్ పోస్ట్ చేశారు. "ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్ ... మేకప్ లేకుండానే బాగున్నావ్. మిమ్మల్ని చేసుకుంటే మాత్రం చికెన్ పంట వేయాల్సిందే వచ్చేవాడు " అంటూ వెరైటీగా రెస్పాండ్ అవుతున్నారు. "తొందర పడకు సుందర వదనా సీజన్ 1 & 2 "సిరీస్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ లాంటి బ్రాండ్‌ల ఫోటోషూట్స్ లో కూడా కనిపించింది ఈ అమ్మడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.