English | Telugu

భవానిని ఇంప్రెస్ చేసిన కృష్ణ.. గీతికకి గోపి లవ్ ప్రపోజల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -212 లో.. భవాని గెటప్ తో కృష్ణ తన వెనకాలే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. భవానిని ఇమిటేట్ చేస్తున్న కృష్ణని చూసి.. ఈ రోజు పెద్ద యుద్ధమే అవుతుందని అందరు టెన్షన్ పడుతుంటారు.

ఆ తర్వాత ఏంటి మురారి యూనిఫామ్ ఎప్పుడు వేసుకోవడం లేదు. ఎప్పుడు ఈ తింగరి పిల్ల వెనకాల తిరుగుతున్నావని మురారిని కృష్ణ అంటుంది. చాలు కృష్ణ ఆపేయ్ అని మురారి అంటాడు. ఏంటి ప్రసాద్ నేను లేనప్పుడు తాగడమే పనిగా పెట్టుకున్నావట.. తాగడం వేడుకలా అప్పుడప్పుడు చెయ్యాలి.. అదేదో ఉద్యమంలాగా చెయ్యకూడదని ప్రసాద్ తో కృష్ణ అంటుంది. ఏంటి ఈ తింగరి పిల్ల నన్ను అనుకరిస్తుందా? నేను లేనప్పుడు చేసిన పనుల గురించి చెప్తుందా అని భవాని తనలో తానే అనుకుంటుంది. ఏ మధు రీల్స్ అంటూ నీ పెళ్ళాం చేతిలో దెబ్బలు పడడం ఎందుకు.. స్క్రిప్ట్ రాయి మనమే ఓన్ గా ప్రొడక్షన్ పెడదామని మధుతో కృష్ణ అంటుంది.

ఆ తర్వాత నువ్వేంటి సుమలత సన్నగా తయారు అవుతున్నావ్.. డైట్ చేస్తున్నావా? అదేదో మెడిటెషన్ కూడా చెయ్ మెంటల్ గా ఫిట్ గా ఉంటావని సుమలతతో కృష్ణ అంటుంది. నువ్వేంటి రేవతి ఇంట్లో పని మొత్తం చేస్తున్నావ్.. ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా.. వాళ్లకి చెప్పొచ్చు కదా అని రేవతితో అంటుంది కృష్ణ. అలాగే అక్క అని రేవతి వెటకారంగా అంటుంది. ముకుంద నువ్వేంటి ఎప్పుడు గదిలోనే ఉంటావ్.. బయటకు వచ్చి అందరితో ఫ్రీగా ఉండని ముకుందతో కృష్ణ అంటుంది. చాల్లే కృష్ణ అత్తయ్య గారిలాగే బాగా చేసావ్ అని ముకుంద అంటుంది. కృష్ణ చేసే దానికి భవానికి నవ్వు వస్తుంది. కానీ బయటకు కనిపిస్తే నా పెద్దరికం ఏం ఉంటుంది అని సైలెంట్ గా కృష్ణ మాటలన్నీ వింటుంది. ఏంటి కృష్ణ మాటలకి భవాని అత్తయ్య ఇంప్రెస్ అయిందా అని ముకుంద తనలో తానే అనుకుంటుంది. అత్తయ్య ఇది మిమ్మల్ని అనుకరించడం కాదు.. అనుసరించడమని భవానితో కృష్ణ అంటుంది.. నువ్వు ఎంత చేసిన అక్కని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. వచ్చి టిఫిన్ చేయమని కృష్ణతో రేవతి అంటుంది. వెళ్ళు వెళ్లి టిఫిన్ చెయ్ అని కృష్ణని భవాని అనగానే.. కృష్ణ సంతోషపడుతుంది.

మరొక వైపు గీతికకి గోపి ప్రపోజ్ చేస్తాడు. నీకు ఇష్టం అయితే రేపు ఇదే టైమ్ కి చెప్పమని గోపి అంటాడు. నాకు ఇష్టమే రేపు ఇదే విషయం చెప్తాను. అలాగే మురారి ముకుందలని మనం ఒకటి చెయ్యొచ్చని గీతిక అనుకుంటుంది. కృష్ణ మురారి ఇద్దరిని ఒకటి చెయ్యాలని గోపి అనుకుంటాడు. మరొక వైపు కృష్ణ వాళ్ళ పెద్దమ్మని ఇంప్రెస్ చేసినందుకు కృష్ణని మురారి ఎత్తుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.