English | Telugu

వాళ్ళ మధ్య ఏదో ఉందని డౌట్ పడిన ఏంజిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -818 లో.. రిషిని ఎవరో కత్తితో పొడిచారు. నేను విశ్వం కలిసి హాస్పిటల్ లో ఉన్న రిషిని కాపాడుకున్నామని ఏంజిల్ చెప్పగానే.. వసుధార జగతి ఎమోషనల్ అవుతారు. నువ్వు చేసింది పెద్ద సాయమని ఏంజిల్ తో జగతి అంటుంది. థాంక్స్ ఏంజిల్ అని వసుధార ఏంజిల్ ని హగ్ చేసుకుంటుంది వసుధార. ఏంటి ఇంత ఎమోషనల్ అవుతున్నారని ఏంజిల్ అనగానే.. ఏం లేదని ఇద్దరు కవర్ చేస్తూ మాట్లాడతారు.

మరొకవైపు రిషి దగ్గరికి మహేంద్ర వస్తాడు. కన్న తండ్రిని కూడా పిలవడానికి ఇష్టపడడం లేదని మహేంద్ర అంటాడు. లేదు డాడ్ మీ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుందని రిషి అంటాడు. ఈ ఒక్క పూట అయిన నీతో ఉంటానని రిషిని మహేంద్ర రిక్వెస్ట్ చేయగానే.. రిషి ఒప్పుకుంటాడు. మహేంద్ర ఎమోషనల్ అవుతూ.. రిషిని హగ్ చేసుకుంటాడు. మీరు ఎక్కువగా ఎమోషనల్ అవకండి. ఇంట్లో ఎవరైనా చుస్తే మన గురించి తెలుస్తుంది. అలా తెలియడం నాకు ఇష్టం లేదని రిషి అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఏంజిల్ వాళ్ళని చూసి.. ఏంటి రిషి అంత ఎమోషనల్ అవుతున్నాడు. వీళ్ళ మధ్య ఏదో ఉందని ఏంజిల్ కి డౌట్ వస్తుంది. కన్న తల్లిపై ఇంత కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా రిషి కి త్వరలోనే నిజం చెప్పాలని మహేంద్ర అనుకుంటాడు. మరొక వైపు విశ్వనాథ్ దగ్గరికి ఏంజిల్ వెళ్లి.. మన ఇంటికి గెస్ట్ లు వచ్చినప్పటి నుండి రిషిలో ఏదో తేడా కనిపిస్తుందని ఏంజెల్ అంటుంది. తెలిసినవాళ్ళు వస్తే అలాగే ఉంటుందని విశ్వనాథ్ అంటాడు. అప్పుడే వసుధార డోర్ దగ్గరికి వచ్చి ఏంజిల్ మాటలు వింటుంది. ఏంజెల్ కి వాళ్ళ మీద డౌట్ రాకుండా చేయాలని అనుకుంటుంది. రిషి సర్ గురించి తెలిసినవాళ్ళు ఎవరైనా సరే అలాగే ఉంటారు. నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా ఏంజిల్ అని వసుధార అంటుంది. అవును కదా.. అనవసరంగా నేనే అన్ని ఆలోచిస్తున్నానని ఏంజిల్ అనుకుంటుంది.

ఆ తర్వాత వసుధార దగ్గరికి ఏంజిల్ వచ్చి రిషి గురించి చెప్తుంది. రిషి, గౌతమ్, నేను ఫ్రెండ్స్ కానీ.. రిషి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలియదు. అసలు రిషి తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలుసుకోవాలి. గౌతమ్ కి తన గురించి తెలుసు కానీ వాడి నెంబర్ నా దగ్గర లేదని ఏంజిల్ అంటుంది. నువ్వు ఎవరినైనా ప్రేమించావా వసుధార అని ఏంజిల్ అడుగుతుంది. అప్పుడే రిషి వస్తాడు. రా రిషి మంచి టాపిక్ నడుస్తుందని ఏంజిల్ అనగానే.. నాకు ఇంట్రెస్ట్ లేదు కాఫీ చేసుకుంటా అని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ కాలేజీ లో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మన కాలేజీ తరుపున ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి వర్క్ చేయాలని విశ్వనాథ్ అనగానే రిషి, వసుధార ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.